Chandrababu Naidu: స్కిల్ స్కామ్‌పై చంద్రబాబును ప్రశ్నిస్తున్న CID.. టాప్ -10 న్యూస్ అప్‌డేట్స్

APSSDC Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణంలోనే విచారణ జరుగుతోంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గం.ల వరకు మాత్రమే విచారణ జరుగుతోంది.

Chandrababu Naidu: స్కిల్ స్కామ్‌పై చంద్రబాబును ప్రశ్నిస్తున్న CID.. టాప్ -10 న్యూస్ అప్‌డేట్స్
Chandrababu Naidu

Updated on: Sep 23, 2023 | 1:42 PM

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణంలోనే విచారణ జరుగుతోంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గం.ల వరకు మాత్రమే విచారణ జరుగుతోంది. ఆ తర్వాతే రేపు కూడా సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించనున్నారు. మరి ఈ కేసులో శనివారంనాడు చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఏంటో చూద్దాం..

  1. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.  సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. విచారణకు ముందుగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
  2. స్కిల్‌ కేసులో చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ….ఆయన చేసిన సంతకాలపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. జీవోకు విరుద్ధంగా ఒప్పందం చేసుకోవడం, కేబినెట్‌ ఆమోదం కోసం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారని సమాచారం వస్తోంది.
  3. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబు విచారణ జరుగుతోంది. పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించొద్దని కోర్టు ఆదేశించడంతో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
  4. చంద్రబాబు విచారణకు 12 మంది సీఐడీ అధికారులు హాజరయ్యారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో విచారణ సాగుతోంది. సీఐడీ అధికారుల విచారణ రేపు కూడా కొనసాగనుంది.
  5.  సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి గంటకు ఐదునిమిషాల పాటు విరామం ఇస్తున్నారు విచారణాధికారులు.
  6.  సిఐడీ విచారణకు రాకముందే రాజమండ్రి జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబులెన్స్‌ లో జైలుకు చేరుకున్న వైద్య సిబ్బంది బాబుకు పరీక్షలు నిర్వహించి..అంతా బాగుందని చెప్పారంటున్నారు.
  7.  చంద్రబాబు విచారణ నేపధ్యంలో రాజమండ్రి జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ జైలు దగ్గర రెండంచెల భద్రత ఉంది. టీడీపీ నేతలెవరూ నిరసన కార్యక్రమాలు చేయకుండా కట్టడి చేసింది.
  8.  స్కిల్‌ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు తరపు లాయర్లు. క్వాష్ పిటిషన్‌ కేసులో నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్ వేశారు. బాబు పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ‌
  9.  బెయిల్‌ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. 38 కేసుల్లో ఏ1గా ఉన్న జైలు మోహన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని ప్రస్తావించాడు.
  10. అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన టీడీపీ నేతలు కొందరు రాజమండ్రికి చేరుకున్నారు. రాజమండ్రిలోనే ఉంటున్న కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న బాలయ్య…మరోవైపు పార్టీ నేతలతోను మాట్లాడుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..