AP SEC: వాలంటీర్లతో ఎన్నికల పనులు చేయించొద్దు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ
ఏపీ ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు వాలంటీర్లతో ఎన్నికల పనులు చేయించొద్దని తేల్చి చెప్పారు. చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
AP SEC Nimmagadda: ఏపీ ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు వాలంటీర్లతో ఎన్నికల పనులు చేయించొద్దని తేల్చి చెప్పారు. చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇవీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా జారీచేసిన ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా వాలంటీర్లను ఎన్నికలకు వినియోగిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించినట్లే అన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
వార్డ్ వాలంటరీర్ల వ్యవస్థపై ఫిర్యాదు చేయాల్సి వస్తే కాల్ సెంటర్‌కు కాల్ చెయ్యొచ్చన్నారు. అవసరం అయితే… SECY.APSEC2@Gmail.comకూడా మెయిల్ చెయ్యొచ్చన్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డు వాలంటీర్లు ఓటర్లను సంప్రదించడం, ప్రభావితం చెయ్యడం వంటివాటిని తీవ్ర నేరాలుగా పరిణనిస్తామన్నారు సీఈసీ.
ఇవి కూడా చదవండి
Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!