
ఉభయగోదావరి జిల్లాల్లో ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో జగ్గంపేట మండలం గొల్లలకుంటకు నిమ్మగడ్డ చేరుకోనున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనివాసులురెడ్డి కుటుంబాన్ని కలుసుకుంటారు. మృతుడు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త. ఎన్నికల ఏర్పాట్లు చాలా సంతృప్తికరంగా ఉన్నాయని నిమ్మగడ్డ తెలిపారు.
ఎన్నికలపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించామన్నారు. విశాఖలో నిబద్ధత కలిగిన అధికారులు ఉన్నారని చెప్పారు. పోలింగ్ నమోదుపై శాతంపై కొద్దిపాటి అసంతృప్తి ఉందని తెలిపారు. ఓటింగ్ శాతం పేరిగేలా చర్యలు తీసుకోవాలని సూచింమని చెప్పారు.
ఎక్కువమంది ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని నిమ్మగడ్డ తెలిపారు. పోటీలో స్వేచ్ఛగా పాల్గొనేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూర్తి ఏకగ్రీవాలకు ఎలెక్షన్ కమిషన్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిఒక్కరూ ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరారు. పంచాయతీ ఎన్నికల కోసం ఓ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల్లో మీడియా రోల్ చాలా గొప్పదని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.
అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన సోమిరెడ్డి… కింజారపు కుటుంబంపై అందుకే కక్ష గట్టారన్న మాజీమంత్రి