కరోనా కారణంగా వాయిదాపడిన 2021-22 విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందులో భాగంగానే అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 188 పని దినాలు ఉండనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ లాస్ట్ క్లాస్ జరగనుంది. అనంతరం వేసవి సెలవులు ఇస్తారు.
ఉన్నత పాఠశాలలు మొత్తం 10 గంటల వరకు పని చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఉన్నత పూర్వ, ఉన్నత, ఉన్నత ప్లస్ బడులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేయనున్నాయి. శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు(పీపీ-1,2) ఉదయం 9.05 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు పని చేయనున్నాయి. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి.
ప్రభుత్వ పాఠశాలలకు ఉండబోయే పండగ సెలవులు ఇలా ఉన్నాయి. దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు. అలాగే దీపావళికి నవంబర్ 4న, క్రిస్మస్(మిషనరీ బడులకు) డిసెంబర్ 23-30 వరకు సెలవులు ఉంటాయి. సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు, ఉగాది ఏప్రిల్ 2న సెలవు ఇస్తారు.
కాగా, 6-10 తరగతుల విద్యార్ధులకు సమ్మెటివ్-1 పరీక్షలు డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు జరగనుండగా.. 6-9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 18 నుంచి 29 వరకు జరుగుతాయి. ఇక సెప్టెంబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. అటు ఈ ఏడాది విద్యార్ధులకు ‘నీటి గంట’ అములు చేయనుండగా.. ప్రతీ నెల మొదటి, మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ను నిర్వహిస్తారు. ఇక ప్రతీ రోజూ ఒక పీరియడ్ ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమానికి కేటాయించానుండగా.. 9-10 తరగతుల విద్యార్ధులకు ప్రతీ శుక్రవారం 8వ పీరియడ్‌లో ‘కెరీర్ గైడెన్స్’పై అవగాహన కల్పిస్తారు.
Also Read:
ఉదయాన్నే టిఫిన్‌లో ఈ 5 ఆహార పదార్ధాలు అస్సలు తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త.! అవేంటంటే..
ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?