AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే మీ కార్డు రద్దే!

Smart Ration Card eKYC Process: ఏపీలోని రేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ప్రభుత్వం గతేడాది జారీ చేసిన స్మార్ట్ రేషన్‌ కార్డులకు సంబందించి ఈకేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్న వారికి రేషన్ సరఫరా ఆగిపోయే ప్రమాదం ఉందని సూచించింది.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే మీ కార్డు రద్దే!
Andhra Pradesh Smart Ration Card Update
Anand T
|

Updated on: May 11, 2026 | 12:01 PM

Share

రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడూ సరికొత్త సంర్కరణలు తీసుకొస్తుంది. అందులో భాగంగానే గతేడాది పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్‌ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఈ స్మార్ట్‌ కార్డు ద్వారానే లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందిస్తోంది. అయితే ప్రభుత్వం అమలు చేసే పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు రేషన్‌ కార్డులను ప్రమాణికంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డు ఈకేవైసీ లేని వారిని అనర్హులను ప్రభుత్వం గుర్తించి తొలగిస్తుంది. అయితే ఈ క్రమంలోనే చాలా మంది లబ్ధిదారులు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకొన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

రేషన్‌ కార్డుల ఈకేవైసీపీ ప్రభుత్వం గతేడాది ప్రారంభించినా ఇప్పటి వరకు చాలా మంది పూర్తి చేసుకోలేదని.. వారందరూ త్వరిత గతినా రేషన్ కార్డు ఈకేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. లేని పక్షంలో ప్రభుత్వ పథకాలు ఆగిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ సరుకులను తీసుకోవాలని, ఎవరైతే తీసుకోరో వారికి కూడా రేషన్ సరఫరా ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

మీరు ఈకేవైసీని ఇలా చేసుకోండి

  • మీరు ఈకేవీసీ చేసుకునేందుకు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని మీ సమీపంలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లండి.
  • అక్కడ ఉన్న e-PoS (ఈ-పాస్) మెషీన్‌లో మీ రేషన్ కార్డు నంబర్ నమోదు చేయమని డీలర్‌ను కోరండి.
  • మీ వేలిముద్ర వేయడం ద్వారా మీ వివరాలను ధృవీకరించండి.
  • మీ వేలిముద్రలు పడకపోతే, ఐరిస్ స్కాన్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
  • ఒకవేళ రేషన్ షాపులో సాంకేతిక సమస్యలు ఉంటే, మీరు సచివాలయంలో కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొబ్బరి నీళ్లు vs చెరకు రసం.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
కొబ్బరి నీళ్లు vs చెరకు రసం.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే..
రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే..
కేసీఆర్‌కు ఇష్టమైన కూర ఇదే.. ఇలా వండితే గిన్నెలు కూడా వదలరు
కేసీఆర్‌కు ఇష్టమైన కూర ఇదే.. ఇలా వండితే గిన్నెలు కూడా వదలరు
సూర్యకుమార్‎కు తొమ్మిదేళ్ల నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయా?
సూర్యకుమార్‎కు తొమ్మిదేళ్ల నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయా?
తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్
సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్
తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని ఏం చేశాడంటే?
తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని ఏం చేశాడంటే?
మీరు వాడే నెయ్యి మంచిదా.. కల్తీదా..? ఇంట్లోనే సింపుల్‌గా ..
మీరు వాడే నెయ్యి మంచిదా.. కల్తీదా..? ఇంట్లోనే సింపుల్‌గా ..
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?