AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips: కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయట!

Kitchen Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చేసే కొన్ని చిన్న పొరపాట్లు ప్రతికూల శక్తిని పెంచుతాయని నమ్ముతారు. వంటగది–బాత్రూమ్ అమరిక, ప్రధాన ద్వారం వద్ద మొక్కలు, గ్యాస్ స్టవ్ స్థానం, చెత్తబుట్ట, పరిశుభ్రత వంటి అంశాల్లో పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు చిట్కాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Vastu tips: కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయట!
Kitchen Vastu
Rajashekher G
|

Updated on: Jul 19, 2026 | 4:18 PM

Share

House Vastu Tips Telugu: వాస్తు శాస్త్రంలో ఇంటి దిశ, గదుల అమరిక, పరిశుభ్రత వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వాస్తు సూత్రాలను అనుసరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, సుఖశాంతులు, శ్రేయస్సు నెలకొంటాయని నమ్మకం. అయితే, కొన్ని సాధారణ వాస్తు లోపాలు ప్రతికూల ప్రభావాలకు కారణమవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంటగది, స్నానాలగది అమరిక, ఇంటి పరిసరాల నిర్వహణ వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఈ సులభమైన సూచనలు పాటించడం ద్వారా వాటి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది.

వంటగది – స్నానాలగది పక్కపక్కనే ఉండకూడదు

వాస్తు ప్రకారం వంటగది (అగ్ని తత్వం), స్నానాలగది (నీటి తత్వం) ఒకదానికొకటి ఆనుకుని ఉండటం శుభప్రదంగా పరిగణించరు. ఒకవేళ ఇంటి నిర్మాణం కారణంగా అవి పక్కపక్కనే ఉంటే, స్నానాలగది ఉపయోగించిన వెంటనే తలుపు మూసి ఉంచడం మంచిదని చెబుతారు. దీనివల్ల ప్రతికూల శక్తి వంటగదిలోకి వ్యాపించకుండా ఉంటుందని విశ్వసిస్తారు.

ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలను నాటొద్దు

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ముళ్లు ఉన్న మొక్కలు లేదా పాల రసం కారే మొక్కలను నాటకపోవడం మంచిదని వాస్తు సూచిస్తుంది. అలాంటి మొక్కలు కుటుంబంలో కలహాలు, ఒత్తిడి, ప్రతికూల వాతావరణానికి కారణమవుతాయని నమ్మకం. బదులుగా తులసి, పచ్చని అలంకార మొక్కలు వంటి శుభప్రదమైన మొక్కలను పెంచడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

అగ్ని – నీటి మూలకాలను దూరంగా ఉంచండి

వంటగదిలో గ్యాస్ స్టవ్‌ను సింక్ లేదా నీటి ట్యాప్‌కు చాలా దగ్గరగా ఏర్పాటు చేయకూడదు. వాస్తు ప్రకారం అగ్ని, నీరు పరస్పర విరుద్ధమైన మూలకాలు. కాబట్టి వీటి మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోవడం మంచిదిగా భావిస్తారు.

ఇంటి ముందు చెత్తబుట్ట ఉంచవద్దు

ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా లేదా ప్రవేశం వద్ద చెత్తబుట్టను ఉంచడం వాస్తు ప్రకారం అనుకూలం కాదు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షించి, కుటుంబ సభ్యుల మానసిక ప్రశాంతత, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. వీలైనంత వరకు చెత్తబుట్టను కంటికి కనిపించని ప్రదేశంలో ఉంచడం మంచిది.

పరిశుభ్రతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వండి

వాస్తు శాస్త్రంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంట్లో సాలెగూళ్లు, దుమ్ము, మురికి, పాడైపోయిన లేదా ఉపయోగం లేని వస్తువులను తొలగిస్తూ ఉండాలి. శుభ్రమైన, క్రమబద్ధమైన ఇల్లు సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచి, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుందని విశ్వసిస్తారు.

(Discliamer: ఈ సమాచారం వాస్తు శాస్త్రంలో పేర్కొన్న సంప్రదాయ విశ్వాసాలు, సూచనల ఆధారంగా అందించిన సమాచారం మాత్రమే. వ్యక్తిగత నమ్మకాలు, ఆచారాలను బట్టి వీటిని అనుసరించవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us