AP Rain Alert: ఏపీలోని ఆ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం.. పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

రాయలసీమ నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. 

AP Rain Alert: ఏపీలోని ఆ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం.. పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!
Andhra Pradesh Rain Alert

Updated on: Jun 15, 2024 | 6:58 PM

రాయలసీమ నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు.

ఆదివారం(16 జూన్) అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

సోమవారం(17 జూన్) అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

శనివారం సాయంత్రం 6 గంటల వరకు గత 24 గంటల వ్యవధిలో విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 78.5మిమీ, బాడంగిలో 60.2మిమీ,కాకినాడ జిల్లా శంఖవరంలో 51.7మిమీ, విజయనగరం నెల్లిమర్లలో 37.5, చీపురుపల్లిలో 37మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.