AP Politics-CBN: చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం.. ఆయన కనిపించడంతో..

|

Nov 25, 2021 | 6:17 AM

AP Politics-CBN: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీగా వర్షాల కారణంగా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

AP Politics-CBN: చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం.. ఆయన కనిపించడంతో..
Babu
Follow us on

AP Politics-CBN: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీగా వర్షాల కారణంగా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. అయితే, ఈ పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తిరుపలిలోని వరద ప్రభావానికి గురైన గాయత్రి నగర్‌లో పరిశీలిస్తుండగా చంద్రబాబుకు తన బాల్య మిత్రుడు తారసపడ్డాడు. అనుకోకుండా బాల్యమిత్రుడు శ్రీనివాస నాయుడు కనిపించడంతో సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. అతనితో కాసేపు ముచ్చటించారు. బాల్యమిత్రుడు శ్రీనివాస నాయుడు ఇంటికి వెళ్లి.. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు చంద్రబాబు.

ఇదిలాఉంటే.. తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాలను చంద్రబాబు కాలినడకన పరిశీలించారు. వరదప్రాంతాల పరిశీలన అనంతరం వైకుంఠపురం వద్ద చంద్రబాబు ప్రసంగించారు. ఇసుక వ్యాపారుల కోసమే అన్నమయ్య ప్రాజెక్ట్ లో నీరు నిల్వ చేశారని ఆరోపించారు. అధిక నీటి నిల్వతో ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందన్నారు. ఫలితంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారని బాధను వ్యక్తం చేశారు. తుమ్మలగుంట చెరువులో ఉండాల్సిన నీరు ఎమ్మార్ పల్లికి వచ్చి కొంపలు ముంచాయన్నారు. ఇన్నేళ్లుగా రాని నీరు ఇపుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు చూస్తే బాధేస్తోందన్నారు. వైసీపీది చెత్త ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదే కలెక్టర్లు, పోలీసులు, ఇంజనీర్లు తన హాయంలో సమర్థంగా పని చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు విఫలం కావడానికి కారణం.. యధారాజ తథ ప్రజా అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

అనంతరం జిల్లాలో భయానక వాతావరణం సృష్టించిన రాయల చెరువును సైతం చంద్రబాబు పరిశీలించారు. ఆ సంధర్భంలోనూ ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో 40 మంది మరణించారని అన్నారు. చిత్తూరు జిల్లాలో వర్షాలు పడటం కొత్తేమి కాదని అన్నారు. భారీ వర్షాలు వస్తాయని ముందుగానే వాతావరణశాఖ హెచ్చిరించిందని, ప్రభుత్వమే లక్ష్యపెట్టలేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణం అని చంద్రబాబు ఆరోపించారు. తుమ్మల గుంట చెరువును క్రికెట్ గ్రౌండ్ చేసుకోవడంతో తిరుపతి నగరం మునిగిపోయిందన్నారు. ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడూ పని చేయకూడదన్నారు. చెక్ డ్యామ్ లు, బ్రిడ్జిలు కొట్టుకుపోవడానికి ప్రభుత్వమే కారణం అన్నారు. ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందన్నారు. తాను అక్కడకు వస్తే ప్రభుత్వం అప్రమత్తం అవుతుందనే ఉద్దేశంతోనే రాయల చెరువుకు వచ్చానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

టీడీపీ ప్రభుత్వ హాయంలో సోమశిల-స్వర్ణముఖి ప్రాజెక్టుకు ప్లాన్ చేశామన్నారు. సీఎం, మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు భరోసానిచ్చి ఉంటే రాయల చెరువు చుట్టూ పక్కల ప్రజలు ఆనందంగా నిద్రపోయేవారని అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఇంకా కష్టాల్లోకి నెట్టే ప్రభుత్వ చర్యలు పద్ధతి కాదని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రౌతు కొద్ది గుర్రం లాగా నడిపించేవారు సక్రమంగా నడిపిస్తే అందరూ బాగుంటారని వ్యాఖ్యానించారు. వరదల వల్ల చనిపోయినవారి కుటుంబాలకు టీడీపీ తరపున రూ.1 లక్ష ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామని చంద్రబాబుు ప్రకటించారు. అలాగే రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Also Read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..