Andhra News: గడ్డి వాము పక్కన కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేసి చూడగా..

అది ఓ వివాహ వేడుక.. రాత్రి అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు.. పెళ్లికి వచ్చిన వధువు బంధువు ఓ బ్యాగు పట్టుకుని కూర్చుంది. అదిగమనించిన ఓ కేటుగాడు.. ఒక్కసారిగా ఆ బ్యాగ్‌ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రి కావంతో అతన్ని పట్టుకోవడం కష్టతరం అయింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు 3 గంటల్లోనే కేసును చేధించారు.

Andhra News: గడ్డి వాము పక్కన కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేసి చూడగా..
Anakapalli Wedding Theft Case

Edited By:

Updated on: Jul 05, 2026 | 10:00 AM

అనకాపల్లి జిల్లా నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సడెన్‌గా పెళ్లింట్లోకి వచ్చిన ఓ దుండగా వదువు బంధవు చేలితో ఉన్న బ్యాగ్‌ను లాక్కొని వెళ్లిపోయాడు. పెళ్లింటి వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బ్యాగ్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పైలా నాయుడు జులై 2వ తేదీన తన కుమారుతి పెళ్లి పెట్టుకున్నాడు. ఈ పెళ్ళికి వధువు తరపు బంధువు రవణమ్మ హాజరయ్యారు. పెళ్లి ఖర్చుల కోసం ఆమె తన వెంట రూ. 5 లక్షల నగదు, పావు తులం బంగారం, ఒక చీర, సెల్ ఫోన్ ఉన్న బ్యాగ్‌ను తెచ్చారు. వివాహ హడావిడిలో ఉన్న ఆమె ఆ బ్యాగ్‌ను తన సోదరి రజని చేతికి ఇచ్చారు. అయితే రాత్రి సమయం దాదాపు 3:30 గంటల ప్రాంతంలో పెళ్లి బంధువులంతా వేడుకలో బిజీగా ఉండటాన్ని గమనించిన ఓ దుండగుడు, ఒక్కసారిగా రజని చేతిలోని బ్యాగ్‌ను లాక్కొని చీకట్లోకి పరారయ్యాడు.

దీంతో  వెంటనే అప్రమత్తమై రజిని బంధువులకు విషయం చెప్పడమే కాకుండా, తక్షణమే 112 కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే నాతవరం పోలీస్ స్టేషన్ బీట్ కానిస్టేబుల్ మహేష్, హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ నేతృత్వంలో, ఎస్సై తారకేశ్వరరావు బృందం ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు జరిపి, నిందితుడిని అదే గ్రామానికి చెందిన పైలా చిట్టిబాబుగా గుర్తించారు. గ్రామ శివారులో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ ఉదంతం వెలుగుచూసింది. తెల్లవారుజామున నిందితుడు చిట్టిబాబు పోలీసులను పొలాల్లోని ఒక గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ గడ్డిని తొలగించి, తను దాచిపెట్టిన బ్యాగ్‌ను బయటకు తీశాడు. బాధితుల సమక్షంలో పోలీసులు వీడియో రికార్డింగ్ చేస్తూ బ్యాగును పరిశీలించగా.. అందులోని రూ. 5 లక్షల నగదు, బంగారం, మొబైల్ ఫోన్, చీర అన్నీ భద్రంగా ఉన్నట్లు తేలింది. దీంతో బాధితులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

ఫిర్యాదు అందిన మూడు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి, దొంగిలించబడిన సొత్తును రికవరీ చేసిన సీఐ రేవతమ్మ, ఎస్సై తారకేశ్వరరావు, కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు. సకాలంలో సమాచారం అందిస్తే నిందితులను పట్టుకోవడం, సొత్తును రికవరీ చేయడం వేగంగా సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us