Andhra Pradesh: ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి కొత్త రూల్స్.. వచ్చే నెల నుంచి నేరుగా అకౌంట్లోకి..

ఏపీలో ప్రతీ నెలా ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్. పించన్ల పంపిణీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే నెల నుంచి కేంద్ర వాటా బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. రాష్ట్ర వాటా మాత్రమ ప్రతీ నెల ఒకటో తేదీన చేతికి అందిస్తారు.

Andhra Pradesh: ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి కొత్త రూల్స్.. వచ్చే నెల నుంచి నేరుగా అకౌంట్లోకి..
Pension

Updated on: Sep 23, 2026 | 6:45 PM

ఏపీలోని పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్. వచ్చే నెల నుంచి పింఛన్ల పంపిణీలో కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ వాటా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచే దీనిని అమలు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద కేంద్రం పింఛన్‌దారులకు కొంతవాటా అందిస్తోంది. ఇప్పటివరకు ఈ వాటా రాష్ట్ర ప్రభుత్వం అందించే పించన్‌తో కలిసి చేతికి అందించేవారు. కానీ వచ్చే నెల నుంచి రాష్ట్ర వాటా చేతికి అందించనుండగా.. కేంద్ర వాటా లబ్దిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ కానుంది. ఏపీలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా పింఛన్లను అందిస్తోండగా.. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(NSAP) స్కీమ్‌ను కూడా దానితో అనుసంధానించారు.

కేంద్ర వాటా బ్యాంక్ అకౌంట్లోకి..

రాష్ట్ర ప్రభుత్వ వృద్దులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4 వేల పెన్షన్ అందిస్తుండగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.3800, కేంద్రం వాటా రూ.200 ఉంది. ఇక దివ్యాంగుల పించన్లకు సంబంధించి ప్రతీ నెలా రూ.6 వేలు అందిస్తుండగా.. రాష్ట్ర వాటా రూ.5700 చేతికి, కేంద్ర వాటా రూ.300 బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి వాటిని కూడా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అందించేవారు. కానీ కేంద్ర ప్రాయోజిత పథకాలను నిధులను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటాను మాత్రమే చేతికి అందిస్తామని, కేంద్ర వాటా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందని సెర్ప్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. పింఛన్ డబ్బులు అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా లబ్దిదారులు బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే పించన్ సొమ్ము అకౌంట్లో జమ అవుతుంది. దీంతో లబ్దిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం చెబుతోంది.

కొత్త పించన్లు మంజూరు

ఏపీ ప్రభుత్వం కొత్త పించన్ల మంజూరు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. దీంతో ప్రభుత్వ అధికారులు దరఖాస్తుదారుల ఇంటికి వచ్చి పరిశీలన చేపడతారు. అన్ని అర్హతలు ఉన్నాయా.. లేదా అనేది పరిశీలిస్తారు. అన్ని అర్హతలు ఉంటే లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త ఫించన్లను మంజూరు చేస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us