Pawan Kalyan: తెలుగు రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు చేసే యాత్రలకు ఒక ప్రత్యేక స్థానం… చరిత్ర ఉంది. ప్రజల కష్ట నష్టాలను తెలుసుకునేందుకు.. స్థానికంగా ఉన్న పరిస్థితులను అంచనావేసేందుకు అనేక పార్టీ ప్రతినిధులు పాదయాత్ర, బస్సు యాత్రలను చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకూ యాత్రలు చేసి.. ప్రజలను ఆకట్టుకుని తమ లక్షలను అందుకుని సీఎం పీఠాన్ని అధిరోహించిన వారే.. తాజాగా ఏపీలో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
జనసేనాని. .అక్టోబర్ 5నుంచి ఏపీలో బస్సు యాత్రను చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ యాత్ర కోసం హైదరాబాద్ లో వాహనాన్ని రెడీ చేస్తున్నారు. తమ అభిమాన నేత యాత్ర సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ బస్సు యాత్రకు వినియోగించనున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బస్సు.. అప్పట్లో ఎన్టీఆర్ ఉపయోగించిన చైతన్య రథాన్ని పోలి ఉంది. రెగ్యులర్ బస్ లు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి వాడారు.
బస్సు వెండి రంగులో ఉన్న ఈ బస్సు ప్రస్తుతం తుది దశ హంగులు అద్దుకుంటుంది. బస్సులో అవసరమైన అన్ని సౌకర్యాలను తయారీదారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బస్సులో ప్రత్యేక సౌండ్ సిస్టమ్ కూడా వస్తుందని చెబుతున్నారు. ఈ నెల 26 లోపు పూర్తి స్థాయిలో రెడీ చేసి.. పవన్ కళ్యాణ్ కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. బస్సు టాప్ నుంచి పవన్ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర జరిగినన్ని రోజులు బస్సులోనే పవన్ ఉంటారు కనుక.. ఆయన అవసరాలకు తగ్గట్టుగా సదుపాయాలను కల్పిస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ ప్రాంతంనుంచి పవన్ యాత్ర ప్రారభించనున్నారనేది.. ఈనెల 18 వ తేదీన ఖరారు చేయనున్నారు. యాత్ర ఎన్నిరోజుల పాటు, ఎన్ని విడతలుగా జరగాలనేది నిర్ణయించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..