AP News: కృష్ణా జిల్లా బంటుమిల్లిలో తీవ్ర విషాదం.. పూడిక తీసేందుకు బావిలోకి దిగి నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బావిలోని పూడిక మట్టి తీసేందుకు వెళ్లిన నలుగురు ఒకరితర్వాత ఒకరుగా మృతి చెందారు.
Four Killed in Bantumilli : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బావిలోని పూడిక మట్టి తీసేందుకు వెళ్లిన నలుగురు ఒకరితర్వాత ఒకరు మృతి చెందారు. ఈ దుర్ఘటన కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నలుగురు కలిసి శుక్రవారం బావిలోని మట్టి తీసేందుకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరిగింది. వీరిలో ఒకరు ఇంటి యజమాని కాగా, ఇద్దరు బంటుమిల్లి బిఎన్ఆర్ కాలనీకి చెందిన తండ్రి కొడుకులు, మరొకరు ములపర్రు గ్రామానికి చెందిన వ్యక్తి అని స్థానికులు తెలిపారు. మృతులు రామారావు, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, రంగాగా గుర్తించారు.
వీరంతా బావిలోని పూడిక మట్టి తీసేందుకు వెళ్లి.. ఊబిలో కూరుకుపోయినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బావిలోకి దిగిన వీరంతా ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు.. మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..