AP Panchayat Elections 2021 Live: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దూకుడు మీదున్న వైసీపీ.. వెనుకంజలో టీడీపీ మద్దతుదారులు

| Edited By: Sanjay Kasula

Mar 10, 2021 | 8:45 PM

AP Local Elections Phase 2: చిన్నచిన్న సంఘటనలు మినహాయించి ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

AP Panchayat Elections 2021 Live: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దూకుడు మీదున్న వైసీపీ.. వెనుకంజలో టీడీపీ మద్దతుదారులు

AP Local Elections Phase 2: చిన్నచిన్న సంఘటనలు మినహాయించి ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక తొలి విడుతలో ముందువరుసలో నిలిచిన వైసీపీ మద్దతుదారులు రెండో దశలోనూ తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ బలపరిచిన వారే ఎక్కువగా విజయం సాధించారు.

ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో  రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళం 72.87, విజయనగరం 82, విశాఖ 84.94,తూ.గో. 82.86, ప.గో.81.75, కృష్ణా 84.14, గుంటూరు 85.51, ప్రకాశం 86.93, నెల్లూరు 78.04, చిత్తూరు 77.20, వైఎస్ఆర్ జిల్లా 80.47, కర్నూలు 80.76, అనంతపురం 84.65 శాతం పోలింగ్‌ నమోదైంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2021 11:07 PM (IST)

    చెముడులో.. ప్రత్యర్థి వర్గం ఆందోళన

    విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం.. చెముడులో 12 ఓట్లతో సర్పంచ్‌గా రాజేశ్వరి గెలుపు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ప్రత్యేర్థి వర్గం ఆందోళన.

  • 13 Feb 2021 11:01 PM (IST)

    అంకిశెట్టిపల్లిలో గందరగోళం..

    చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో గందరగోళం నెలకొంది. శరత్‌రెడ్డి 12 ఓట్లతో సర్పంచ్‌గా గెలిచినట్లు అధికారుల ప్రకటించడంతో ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

  • 13 Feb 2021 09:59 PM (IST)

    పంచాయతీ ఎన్నిల్లో కొనసాగుతోన్న వైసీపీ మద్దతుదారుల హవా.. ఇప్పటి వరకు ఎన్ని ఏయే జిల్లాల్లో ఎన్ని స్థానాల్లో నిలిచారంటే..

    శ్రీకాకుళం – 52
    విజయనగరం – 36
    విశాఖ – 30
    తూర్పు గోదావరి – 12
    పశ్చిమ గోదావరి – 15
    కృష్ణా – 35
    గుంటూరు – 21
    ప్రకాశం – 53
    నెల్లూరు – 31
    చిత్తూరు – 40
    కర్నూలు – 19
    అనంతపురం – 35
    వైఎస్సార్‌ జిల్లా – 28

  • 13 Feb 2021 09:49 PM (IST)

    ‘చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు వైసీపీకే మద్దతు నిలిచారు‘..

    ఏపీ పంచాయతీ రెండో దశ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగిరేస్తుండడంపై వైసీపీ నేత, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు స్పందించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు వైసీపీ బలపరిచిన అభ్యర్థులకే పట్టం కట్టారని అన్నారు. ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ప్రజలంతా చంద్రబాబుకు చెంపపెట్టులాంటి సమాధానం చెప్పారని అన్నారు.

  • 13 Feb 2021 09:39 PM (IST)

    ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు..

    ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనంతపురం జిల్లాకు చెందిన భోగినేపల్లి సర్పంచ్‌గా బండి ఉజ్జినప్ప ఒక్క ఓటుతో గెలుపొందారు. ఇక ఇదే జిల్లాలోని పాతపాళ్యం సర్పంచ్‌గా పూజారి రేవతి కూడా ఒకే ఓటు మెజార్టీతో గెలుపొందడం విశేషం.

  • 13 Feb 2021 08:52 PM (IST)

    రెండో దశ ఎన్నికల ఫలితాల్లో అరుదైన సంఘటన.. టై అయిన ఫలితం.

    చిలకలూరిపేట మండలం గొట్టిపాడులో పంచాయతీ ఎన్నికల ఫలితం టై అయింది. అయితే తొలుత దండా రోశమ్మ 2 ఓట్లతో గెలుపొందారు. దీంతో ప్రత్యర్థి అభ్యర్థి రీ కౌంటింగ్ కోరారు. మరోసారి కౌంటింగ్ చేయడంతో ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో మళ్లీ రీకౌంటింగ్ చేయాలని అభ్యర్థులు ధర్నా చేశారు.

  • 13 Feb 2021 08:00 PM (IST)

    కొనసాగుతోన్న వైసీపీ మద్దతుదారుల హవా.. ఇప్పటి వరకు జిల్లాలా వారీగా ఎన్ని స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారంటే..

    శ్రీకాకుళం జిల్లా – 35 స్థానాలు.
    విజయనగరం – 36
    విశాఖ – 15
    తూర్పు గోదావరి – 12
    పశ్చిమ గోదావరి – 7
    కృష్ణా – 31
    గుంటూరు – 21
    ప్రకాశం – 31
    నెల్లూరు – 31
    చిత్తూరు – 40
    కర్నూలు – 19
    అనంతపురం – 35
    కడప – 8

  • 13 Feb 2021 07:40 PM (IST)

    రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లోనూ దూసుకెళుతోన్న వైఎస్‌ఆర్‌సీ మద్దతుదారులు.. ఇప్పటి వరకు వెల్లడైన..

    ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో దశలోనూ వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 250కిపైగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

  • 13 Feb 2021 06:49 PM (IST)

    వెలువడుతోన్న ఏపీ పంచాయతీ రెండో దశ ఎన్నికల ఫలితాలు.. ఆయా జిల్లాల్లో గెలుపొందిన వారు..

    శ్రీకాకుళం జిల్లా సిద్దిగాం – రమణమూర్తి.
    శ్రీకాకుళం జిల్లా గుణుపల్లి – కామేశ్వర.
    శ్రీకాకుళం జిల్లా అంపాపురం – మోహిని.
    చిత్తూరు జిల్లా బండ్ల – వెంకటరత్నా.
    చిత్తూరు జిల్లా వీఆర్ అగ్రహారం – వెంకటరమణ రెడ్డి.
    విజయనగరం జిల్లా మోదుగ – సావిత్రి.
    విజయనగరం జిల్లా గుట్టూరు – సింహాచలం.
    అనంతపురం జిల్లా సిద్దరాంపురం – అంజయ్య.
    ప్రకాశం జిల్లా అలవలపడు – వీరగంధం.

  • 13 Feb 2021 06:30 PM (IST)

    రెండో విడత ఎన్నికలోనూ కొనసాగుతోన్న వైసీపీ మద్దతుదారుల హవా.. జిల్లాల వారీగా వెలువడుతోన్న ఫలితాల ప్రకారం..

    విజయనగరం జిల్లా లేవిడ్ – కవిత.
    విజయనగరం జిల్లా గుమ్మ – బాలయ్య.
    విజయనగరం జిల్లా గుమ్మిగూడ – సురేష్.
    శ్రీకాకుళం జిల్లా హొన్నాలి – అనసూయ.
    కర్నూలు జిల్లా కైఫ – చిన్న లక్ష్మమ్మ.
    అనంతపురం జిల్లా రాయలప్ప దొడ్డి – రామ్మోహన్.
    చిత్తూరు జిల్లా కనసానివారిపల్లె – ఆర్కే కృష్ణా రెడ్డి.
    ప.గో జిల్లా చెరుకుమిల్లి – వరలక్ష్మి.
    శ్రీకాకుళం జిల్లా సరియాపల్లి – బత్తిని వైకుంఠరావు.
    శ్రీకాకుళం జిల్లా చినవంక – విజయలక్ష్మి.
    కృష్ణా జిల్లా నెమ్మలూరు – గోపాలం విజయం.

  • 13 Feb 2021 06:20 PM (IST)

    కొనసాగుతోన్న ఏపీ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ.. ప్రకాశం జిల్లాలో వెలువడిన ఫలితాలు..

    సంగాపురం – వెంటేశ్వర్లు.
    రామభద్రపురం – వెంకట లక్ష్మమ్మ.
    నక్కలబొక్కలపాడు – బుల్లిరామయ్య.
    కొంగపాడు – రమాదేవి.

  • 13 Feb 2021 06:09 PM (IST)

    కొనసాగుతోన్న కౌంటింగ్ ప్రక్రియ.. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాలో గెలిపొందిన వారు..

    రామిరెడ్డి పల్లి – సోమసుందర్ రెడ్డి.
    పలుకుదొడ్డి – లక్ష్మిదేవి.
    మెట్టుపల్లె – మద్దిలేటి.
    తిమ్మాపురం – సుప్రజ.
    నెరవాడ – మదన్ గోపాల్ రెడ్డి.
    యాపర్లపాడు – వెంకటరామిరెడ్డి.
    కమ్మవారి పల్లె – కొండయ్య.

  • 13 Feb 2021 06:02 PM (IST)

    కొనసాగుతోన్న కౌంటింగ్ ప్రక్రియ.. ఆయా జిల్లాల్లో వెలువడుతోన్న ఫలితాలు.. ఇలా ఉన్నాయి..

    గుంటూరు జిల్లా రూపినగుంట్ల – ఆదిలక్ష్మి.
    విజయనగరం జిల్లా రావికోన – రామస్వామి.
    శ్రీకాకుళం జిల్లా టంగరిపుట్టి – నవిత.
    శ్రీకాకుళం జిల్లా లొత్తూరు – పద్మ.
    శ్రీకాకుళం జిల్లా బిన్నల – భవాని.
    విజయనగరం జిల్లా శివడ – మిన్నరావు.
    అనంతపురం జిల్లా దంపేట్ల – కరుణాకర్ నాయుడు.
    అనంతపురం జిల్లా ఈదులపల్లి – ప్రభాకర్ రెడ్డి.
    ప్రకాశం జిల్లా బిచ్చలకూరపాడు – రమణమ్మ.
    ప్రకాశం జిల్లా ఉప్పలపాడు – అనిల్.
    గంటూరు జిల్లా రూపినగుంట్ల – ఆదిలక్ష్మి.
    విజయనగరం జిల్లా రావికోన – రామస్వామి.

  • 13 Feb 2021 05:47 PM (IST)

    కొనసాగుతోన్న కౌంటింగ్ ప్రక్రియ.. ఆయా జిల్లాల్లో వెలువడుతోన్న ఫలితాలు.. ఇలా ఉన్నాయి..

    అనంతపురం జిల్లా ధర్మపురి – సాయి ప్రసన్న.
    విజయనగరం జిల్లా చిన్నగీశాడ – శాంతి.
    విజయనగరం జిల్లా తాడికొండ – జగ్గారావు.
    కర్నూలు జిల్లా రామిరెడ్డిపల్లె – సోమసుందర్ రెడ్డి.
    అనంతపురం జిల్లా యలగలపంకతండా – శోభాబాయ్
    చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం – భాగ్యమ్మ

  • 13 Feb 2021 05:38 PM (IST)

    కొనసాగుతోన్న కౌంటింగ్ ప్రక్రియ.. ఆయా జిల్లాల్లో వెలువడుతోన్న ఫలితాలు..

    చిత్తూరు జిల్లా రంగన్న గారిడ్డ – యువజ్యోతి.
    చిత్తూరు జిల్లా విటల – స్వాతి
    గుంటూరు జిల్లా శివపురంతాండా – బాలిబాయ్.
    విజయ నగరం జిల్లా నెల్లికిక్కువ – రాములమ్మ.

  • 13 Feb 2021 04:43 PM (IST)

    వెలువడుతోన్న విజయనగరం జిల్లా ఫలితాలు.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు..

    ఒబ్బంగి – సుశీల (వైఎస్స్‌ఆర్‌సీపీ మద్దతుదారు)
    ఊసకొండ – సులోచన (వైఎస్స్‌ఆర్‌సీపీ మద్దతుదారు)
    రెల్ల – శంకర్ రావు (వైఎస్స్‌ఆర్‌సీపీ మద్దతుదారు)
    వంగర – పత్తిక జ్యోతి
    బీరుపాడు – కళావతి
    పెదగొత్తిలి – కె.బాబూ రావు
    ఆడారు – తాడంబి దిబ్బన్న
    గోచక్క – సన్యాసినాయుడు
    గుణతతిలేసు – నందినమ్మ

  • 13 Feb 2021 04:35 PM (IST)

    తొలి ఫలితం విడుదల… విజయనగరం జిల్లా జరడ సర్పంచ్‌గా..

    ఏపీ రెండో దశ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో తొలి ఫలితం వెల్లడైంది. విజయనగరం జిల్లా జరడ సర్పంచ్‌గా వైఎస్స్‌ఆర్‌సీపీ మద్దతుదారు జ్యోతి గెలుపొందారు.

  • 13 Feb 2021 04:10 PM (IST)

    ప్రారంభమైన కౌంటింగ్.. రాత్రిలోపు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం..

    ఏపీలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో దశలో మొత్తం 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు ఓట్లు లెక్కించనున్నారు.

  • 13 Feb 2021 03:49 PM (IST)

    80 నుంచి 85 శాతం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..

    చిన్న చిన్న సంఘటలను మినహాయిస్తే ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3.30 వరకు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇక మధ్యాహ్నం 2.30 వరకు సుమారు 76 శాతం పోలింగ్ నమోదుకాగా మరో 10 శాతం పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతో రెండో విడతలో 85 శాతం వరకు పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి.

     

     

  • 13 Feb 2021 03:37 PM (IST)

    ఫలితాలు ఆలస్యం కాకుండా పటిష్ట చర్యలు..

    తొలి విడత ఎన్నికల ఫలితాల్లో జరిగిన ఆలస్యాన్ని ఈసారి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 4.30 తర్వాత కౌంటింగ్ ప్రారంభంకానుండగా… మైనర్ పంచాయతీలకు సంబంధించిన 7.30కల్లా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా టేబుళ్ల సంఖ్యను పెంచారు.

  • 13 Feb 2021 03:33 PM (IST)

    ఏపీలో ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ప్రారంభంకానున్న కౌంటింగ్.

    ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితమే ముగిసింది. 3.30 వరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

  • 13 Feb 2021 03:21 PM (IST)

    మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఆయా జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలు..

    శ్రీకాకుళం – 63.84%

    విజయనగరం – 77.03%

    విశాఖపట్నం – 79.81%

    తూర్పుగోదావరి జిల్లా – 74.97%

    పశ్చిమ గోదావరి – 75.75%

    కృష్ణాజిల్లా – 76.56%

    గుంటూరు – 78.03%

    నెల్లూరు – 72.94%

    చిత్తూరు – 73.06%

    కడప – 75.17%

  • 13 Feb 2021 03:09 PM (IST)

    కృష్ణాజిల్లా ఎస్పీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు..

    కృష్ణాజిల్లా ఎస్పీకి నిమ్మగడ్డ కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎస్ఈసీ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ… 504, 505 (1), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

  • 13 Feb 2021 01:55 PM (IST)

    పిఠాపురం మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

    తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామపంచాయతీ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు భారీ తరలివస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు.

  • 13 Feb 2021 01:30 PM (IST)

    క్రమేపీ పెరుగుతున్న పోలింగ్‌ శాతం..

    ఆంధ్రప్రదేశ్ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ శాతం క్రమేసీ పెరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్‌ నమోదయిందన్నారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 71.5 శాతం నమోదు కాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 51.30 శాతంగా నమోదైనట్లు గిరిజా శంకర్ తెలిపారు.

    జిల్లాల వారిగా ఓటింగ్ శాతం

    •  శ్రీకాకుళం జిల్లా- 51.30 శాతం
    • విజయనగరం జిల్లా- 71.5 శాతం
    • విశాఖ జిల్లా- 64.28 శాతం
    • తూర్పుగోదావరి- 60.90 శాతం
    • పశ్చిమగోదావరి- 63.54 శాతం
    • కృష్ణా జిల్లా- 66.64 శాతం
    • గుంటూరు జిల్లా- 69.08 శాతం
    • ప్రకాశం జిల్లా- 65.15 శాతం
    • నెల్లూరు జిల్లా- 59.92 శాతం
    • చిత్తూరు జిల్లా-67.20 శాతం
    • వైఎస్సార్‌ జిల్లా- 64.28 శాతం
    • కర్నూలు జిల్లా- 69.61 శాతం
    • అనంతపురం జిల్లా- 70.32 శాతం
  • 13 Feb 2021 01:25 PM (IST)

    ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయిన జనం

    ప్రకాశంజిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో ఓటు వేసేందుకు రావద్దని ఓ వర్గానికి చెందిన నేతలు బెదిరించడంతో భయంతో గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఓటింగ్‌కు వెళ్లితే తమపై దాడి చేస్తారన్న భయంతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్‌పి శిద్దార్ద్‌ కౌశల్‌ గ్రామంలో.. బుల్లెట్‌ వాహనంపై తిరుగుతూ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్‌ ప్రశాంతంగా జరుగుతుందని పోలింగ్‌ సిబ్బంది చెప్పడంతో ఎస్‌పి తిరిగి వెళ్లిపోయారు.

  • 13 Feb 2021 12:48 PM (IST)

    పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సర్పంచి అభ్యర్థి

    కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్ అభ్యర్థి లీలా కనకదుర్గ పోలింగ్ రోజే ప్రసవించింది. ఈ ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్న కొద్దిసేపటికే నొప్పులు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె అస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

  • 13 Feb 2021 12:35 PM (IST)

    మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి హౌజ్ అరెస్ట్

    కడప జిల్లా కమలాపురం మండలం కోగటం గ్రామంలో శాంతి భద్రతల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు తన రాజకీయ ప్రత్యర్ధి అయిన వీరాశివారెడ్డి తమ్ముని కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

  • 13 Feb 2021 12:29 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న త్రిమూర్తులు

    తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటయ పాలెం గ్రామ పంచాయతీ 8వ వార్డు పోలింగ్ బూత్‌లో మాజీ శాసనసభ్యులు కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూ లైన్‌లో నిల్చుని అందరితో పాటు ఓటు వేశారు.

  • 13 Feb 2021 12:17 PM (IST)

    ప్రాసంగులపాడు పంచాయతీలో గుర్తుల తారుమారు

    ప్రకాశంజిల్లా కొరిశెపాడు మండలం ప్రాసంగులపాడు పంచాయతీలోని 4వ వార్డు పోలింగ్‌ నిలిచిపోయింది. వార్డు మెంబర్‌గా పోటీలో ఉన్న అభ్యర్ధిని సంధ్యకు కేటాయించిన ఐరన్‌బాక్స్‌ గుర్తుకు బదులు బ్యాలెట్‌ పేపర్‌లో స్టూలు గుర్తు ముద్రించి ఉండటంతో అభ్యర్ధిని సంధ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జరిగిన పొరపాటును గుర్తించిన పోలింగ్‌ సిబ్బంది 4వ వార్డుకు పోలింగ్‌ను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు.

  • 13 Feb 2021 12:13 PM (IST)

    మారెళ్లవారిపాలెంలో టీడీపీ – వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

    గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మారెళ్ళవారిపాలెంలో టీడీపీ – వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు వైసీపీ ఏజెంట్లను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

  • 13 Feb 2021 11:58 AM (IST)

    పోలింగ్ విధుల్లో ఉన్న విఆర్ఏ గుండెపోటుతో మృతి

    చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో విషాదం చోటుచేసుకుంది. తంబల్లపల్లి మండలం కోసువారి పల్లిలో పోలింగ్ విధుల్లో ఉన్న విఆర్ఏ నరసింహులు గుండెపోటుతో మృతి చెందారు. పోలింగ్ కేంద్రం వద్దనే కుప్పకూలి పోయిన నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు.

  • 13 Feb 2021 11:39 AM (IST)

    ఉదయం 10:30 వరకు 38.07 శాతం పోలింగ్..

    ఏపీలో చెదురు మదురు సంఘటనలు మినహా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10:30 వరకు 38.07 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 48 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్‌ తెలిపారు.

    ఇక జిల్లావారీగా నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది…

    ✔ శ్రీకాకుళం-26.81 శాతం

    ✔ విజయనగరం-48.08 శాతం

    ✔ విశాఖ జిల్లా-40.94 శాతం

    ✔ తూర్పుగోదావరి- 34.51 శాతం

    ✔ పశ్చిమగోదావరి- 31.6 శాతం

    ✔ కృష్ణా జిల్లా- 35.81 శాతం

    ✔ గుంటూరు జిల్లా- 45 శాతం

    ✔ ప్రకాశం జిల్లా- 34.14 శాతం

    ✔ నెల్లూరు జిల్లా- 36.3 శాతం

    ✔ చిత్తూరు జిల్లా- 33.50 శాతం

    ✔ కర్నూలు జిల్లా- 46.96 శాతం

    ✔ అనంతపురం జిల్లా- 41.29 శాతం

    ✔ వైఎస్సార్‌ జిల్లా- 35.17 శాతం

  • 13 Feb 2021 11:21 AM (IST)

    చిరమనలో వైసీపీ, టీడీపీ వర్గాల బాహాబాహీ

    నెల్లూరు జిల్లా ఎస్‌ పేట మండలం చిరమనలో ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది.

  • 13 Feb 2021 11:16 AM (IST)

    బోడపాడు గ్రామంలో రీ పోలింగ్‌కు డిమాండ్

    ప్రకాశంజిల్లా కొనకనమిట్ట మండలం వాగుమడుగు పంచాయతీ బోడపాడు గ్రామం పోలింగ్ బూత్‌లో వైసీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోొపించారు. వెంటనే పోలింగ్‌ నిలిపివేసి రీ కౌంటింగ్‌ జరపాలని టిడిపి బలపరిచిన అభ్యర్ధి డిమాండ్‌ చేస్తున్నారు.

  • 13 Feb 2021 11:14 AM (IST)

    ఏల్చూరు 14వ వార్డులో నిలిచిన పోలింగ్

    ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో 14వ వార్డులో అధికారులు పోలింగ్ నిలిపివేశారు. ఓటర్ల జాబితాలో తప్పుల పై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

  • 13 Feb 2021 10:53 AM (IST)

    మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు స్వగ్రామంలో ఘర్షణ

    గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్లలో ఘర్షణ చోటు చేసుకుంది. 7వ వార్డు పోలింగ్ బూత్‌లో ప్రజల నుంచి ఓటరు స్లిప్‌లు లాక్కొని తానే ఓట్లు వేసేందుకు ఓ ఏజెంట్ ప్రయత్నించాడు. అయితే, మరో అభ్యర్థికి చెందిన ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సర్ధుమణిగింది.

  • 13 Feb 2021 10:45 AM (IST)

    పొదిలి మండలంలో స్వల్ప ఉద్రిక్తత

    ప్రకాశం జిల్లా పొదిలి మండలం దాసల్లపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అప్రమత్తమయిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 13 Feb 2021 10:40 AM (IST)

    బ్యాలెట్‌ పేపర్లలో గుర్తులు తారుమారు

    గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు రెండో వార్డు బ్యాలెట్‌ పేపర్లలో గుర్తులు తారుమారు కావడంతో అధికారులు పోలింగ్‌ నిలిపివేశారు.

  • 13 Feb 2021 10:37 AM (IST)

    మంచినీళ్లపేటలో ఎన్నికలు ఆపాలంటూ గ్రామస్తులు నిరసన

    శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో గందరగోళం నెలకొంది. ఎన్నికలు ఆపాలంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు. 2019 ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. 196 కొత్త ఓట్లు చేర్చటంపై అభ్యంతరం తెలిపారు.

  • 13 Feb 2021 10:34 AM (IST)

    విక్రమపురంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ

    విజయనగరం జిల్లా కొమరాడ మండలం విక్రమపురంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలింగ్ కేంద్రంలోనే నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది.

  • 13 Feb 2021 10:31 AM (IST)

    వృద్ధురాలికి పోలీసుల సహాయం

    గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం పొట్లూరు లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్దురాలుకి స్పెషల్ పార్టీ పోలీసులు సహాయపడ్డారు.

  • 13 Feb 2021 10:22 AM (IST)

    వైసీపీ – జనసేన పార్టీ వర్గాల మధ్య ఘర్షణ

    గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ – జనసేన పార్టీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

  • 13 Feb 2021 10:18 AM (IST)

    ఉప్పర పల్లి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కడప జిల్లా ఎస్పీ

    కడప జిల్లా చెన్నూరు మండలం ఉప్పర పల్లి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలోని పోలీసు అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్లు ని‌ర్బయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

  • 13 Feb 2021 10:16 AM (IST)

    జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు..

    ఉదయం 6.30 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1.30 గంటలకు పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పోలింగ్‌ను పరిశీలిస్తే.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 21 శాతం నమోదు కాగా. అత్యల్పంగా క‌ృష్ణా జిల్లాలో 6.3 శాతం మాత్రమే నమోదు అయ్యింది. శ్రీకాకుళం జిల్లా 10.4, విజయనగరం జిల్లా 11.6, విశాఖపట్నం జిల్లా 12.4, తూర్పుగోదావరి జిల్లా 10.67, పశ్చిమ గోదావరి జిల్లా 10.24, కృష్ణా జిల్లా 6.4, గుంటూరు జిల్లా 10, ప్రకాశం జిల్లా 11, నెల్లూరు జిల్లా 11.8, చిత్తూరు జిల్లా 6.3, కడప జిల్లా 7.5, కర్నూలు జిల్లా 21, అనంతపురం 7.03 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.

  • 13 Feb 2021 10:02 AM (IST)

    ఓ వృద్దుడిని భూజాలపై మోసుకెళ్లిన పోలీసులు

    గుంటూరు జిల్లాలోని వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పొట్లూరు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్‌కు వృద్ధుడి భూజాల మీద తీసుకెళ్లారు పోలీసులు.

  • 13 Feb 2021 09:58 AM (IST)

    ఓటు వేసిన వృద్ధురాలు

    చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. మదనపల్లెలో ఓ వృద్దురాలు కుటుంబసభ్యుల సహాయంతో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు.

  • 13 Feb 2021 09:52 AM (IST)

    నిమ్మకూరులో స్వల్ప ఉద్రిక్తత

    కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య స్వల్వ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వృద్ధురాలితో బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేయగా, టీడీపీ నేతను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అడ్డకున్నారు. ఇర్గువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. పోలీసులు చెదరగొట్టారు.

  • 13 Feb 2021 09:50 AM (IST)

    ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

    చిత్తూరు జిల్లా కుప్పం మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కుప్పంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని వినతి చేశారు.

  • 13 Feb 2021 09:47 AM (IST)

    ఆత్మకూరు డివిజ‌న్‌లో భారీగా ఓటింగ్ నమోదు

    నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు డివిజ‌న్‌లో భారీగా ఓటింగ్ నమోదు అవుతోంది. ఉద‌యం 8.30 గంట‌ల‌కు డివిజ‌న్‌లో 12 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఆత్మకూరులో అత్యధికంగా 16 శాతం, క‌లువాయిలో 8 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. అలాగే అనంత‌సాగ‌రం – 13.14, ఏఎస్ పేట – 10.87, చేజ‌ర్ల – 12.16, మ‌ర్రిపాడు-12.11, సంగం – 10, సీతారామ‌పురం- 11.81, ఉద‌య‌గిరి-14.52, వింజ‌మూరు 12.79 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

  • 13 Feb 2021 09:23 AM (IST)

    కోవిడ్ బాధితులు మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు అవకాశం

    కోవిడ్ బాధితులు మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 12.30 నుంచి 1.30 గంటల వరకు ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట వీరికి పీపీఈ కిట్లు సమకూర్చనున్నారు. ఓటర్లను థర్మల్‌ స్కానింగ్‌ చేశాకే పోలింగు కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

  • 13 Feb 2021 09:17 AM (IST)

    తొలి రెండు గంటల్లో పోలింగ్ 10.28 శాతం నమోదు..

    రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ తొలి రెండు గంటల్లో పోలింగ్ 10.28 శాతం నమోదైంది. చిన్న చిన్న ఘటనలు మినహా.. పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది.

  • 13 Feb 2021 09:00 AM (IST)

    ప.గో జిల్లాలో ఊపందుకున్న పోలింగ్

    పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ ఊపందుకుంది. కొవ్వూరు నియోజవర్గం మూడు మండలాల్లో మొదలైన రెండో విడత పోలింగ్ ఉదయం 7:30 గంటలకు చాగల్లు మండలంలో ఐదు శాతం పోలింగ్ నమోదైంది. కొవ్వూరు మండలంలో ఉదయం 7:30కు మూడు శాతం పోలింగ్ నమోదైంది. అలాగే తాళ్లపూడి మండలంలో నాలుగు శాతం పోలింగ్ నమోదైంది.

  • 13 Feb 2021 08:57 AM (IST)

    రిటర్నింగ్‌ అధికారులను సస్పెన్షన్

    శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట గ్రామ పంచాయతీ రిటర్నింగ్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు, బ్యాలెట్‌ పత్రాల భద్రత, అప్పగింత విషయంలో తీవ్ర అలసత్వం వహించినందుకు స్టేజ్‌-2 ఆర్వోగా ఉన్న కొత్తూరు మండలం కుంటిభద్ర జడ్పీ పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎల్‌.గోవర్దనరావు, స్టేజ్‌-2 రిజర్వు ఆర్వోగా ఉన్న పాతపట్నం మండలం తెంబూరు జడ్పీ పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్ వి.మల్లేసు సస్పెన్షన్‌కు గురయ్యారు.

  • 13 Feb 2021 08:54 AM (IST)

    చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడి మార్పు

    చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడిని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చేసింది. ఇప్పటివరకు పరిశీలకునిగా ఉన్న సర్వే, సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్‌ నవీన్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

  • 13 Feb 2021 08:51 AM (IST)

    నామినేషన్లు చివరి క్షణంలో ఉపసంహరణతో నిలిచిన పోలింగ్

    నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రం పంచాయతీలో సర్పంచి స్థానానికి 8 మంది, వార్డులకు 19 మంది వేసిన నామినేషన్లు చివరి క్షణంలో ఉపసంహరించుకున్నారు. ఎన్నికలు బహిష్కరించాలని గ్రామస్థుల ఉమ్మడిగా నిర్ణయించడంతో.. ఇక్కడా ఎన్నికలు జరగడం లేదు.

  • 13 Feb 2021 08:50 AM (IST)

    ఒకే నామినేషన్ వచ్చిందని అధికారుల తిరస్కరణ

    శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవు పంచాయతీ ఎప్పుడూ ఏకగ్రీవమయ్యేది. ఈసారి కూడా ఒక్కరే నామినేషన్‌ వేసినప్పటికీ పరిశీలనలో తిరస్కరణకు గురైంది. దీంతో ఎన్నికలు నిలిచిపోయాయి

  • 13 Feb 2021 08:49 AM (IST)

    రోడ్డు వేయలేదని ఎన్నికలు బహిష్కరణ

    కర్నూలు గ్రామీణ మండలం పూడూరు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించనందుకు నిరసనగా ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు.

  • 13 Feb 2021 08:48 AM (IST)

    ఎన్నికలను బహిష్కరించిన 3 గ్రామాలు

    రెండో విడతలో భాగంగా శనివారం జరగాల్సిన ఎన్నికలు మూడు గ్రామాల్లో నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా,కర్నూలు గ్రామీణ మండలం, నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో వివిధ కారణాల ద‌ృష్ట్యా ఎన్నికలు నిర్వహించడంలేదని అధికారులు తెలిపారు

  • 13 Feb 2021 08:41 AM (IST)

    అంకంపల్లి ఆరో వార్డులో పోలింగ్‌ ఆలస్యం

    అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం అంకంపల్లి ఆరో వార్డులో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కాకపోవడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

  • 13 Feb 2021 08:39 AM (IST)

    పామర్రు మండలంలో ప్రశాంతంగా పోలింగ్

    కృష్ణాజిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పామర్రు మండల మొత్తం 25 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ కాగా, మిగిలిన 21 గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
    ఓటుహక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

  • 13 Feb 2021 08:34 AM (IST)

    ఓటు వేసిన ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు

    విజయనగరం జిల్లాలో.. గ్రామ పంచాయితీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు గ్రామంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 13 Feb 2021 08:33 AM (IST)

    నర్సింగపాడు రెండో వార్డులో నిలిచిపోయిన పోలింగ్​

    గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు రెండో వార్డులో అధికారులు పోలింగ్​ను నిలిపివేశారు. బ్యాలెట్‌ పేపర్లలో గుర్తులు తారుమారు కావటంతో పోలింగ్ నిలిపివేసినట్లు ఉన్నతాధికారులకు.. సిబ్బంది సమాచారం అందించారు.

  • 13 Feb 2021 08:22 AM (IST)

    నడిగడ్డలో గ్రామపంచాయతీలో బ్యాలెట్ పత్రాలు మాయం

    గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డలో గ్రామపంచాయతీ 8వ వార్డులో బ్యాలెట్ పత్రాలు మాయమయ్యాయి. రిజర్వు బ్యాలెట్ పత్రాలతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సిబ్బంది రాత్రి భోజనం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బ్యాలెట్‌ పత్రాలను ఎత్తుకెళ్లారు.

  • 13 Feb 2021 08:19 AM (IST)

    కందరాడలో కొనసాగుతున్న రీ పోలింగ్

    తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో రీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు తరలివస్తున్నారు. మరోవైపు తొలివిడత కౌంటింగ్ ప్రక్రియలో జరిగిన ఘటనలు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు..

  • 13 Feb 2021 08:05 AM (IST)

    సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిః ఎస్పీ రవీంద్రనాథ్

    సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. గుడివాడ డివిజన్‌లో ‌మూడు‌ వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలిపారు.  ఇప్పటికే చాలా మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని… కొంతమందిపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. ఎన్నికల ఫలితాలు తరువాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, రోడ్ల పైకి వచ్చి హడావుడి చేస్తే.. చర్యలు తప్పవని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు.

  • 13 Feb 2021 08:01 AM (IST)

    పోలింగ్ కేంద్రంలో చీకటి

    రాప్తాడు మండల కేంద్రంలోని ఎనిమిదో వార్డు పోలింగ్ కేంద్రంలో అంధకారం నెలకొంది. గత రాత్రి నుంచి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు సిబ్బంది . సెల్ ఫోన్ లైటింగ్ సాయంతో పోలింగ్ సామాగ్రి సరి చేసుకుంటున్నారు.

  • 13 Feb 2021 07:34 AM (IST)

    పోలింగ్‌కు భారీ భద్రత ఏర్పాట్లు

    పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 13 Feb 2021 07:26 AM (IST)

    పంచాయతీ ఏకగ్రీవాలపై హైకోర్టు

    ఏపీ హైకోర్టు చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లో పంచాయతీ ఏకగ్రీవాలపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల అక్రమాలపై స్పందించాలని.. అన్ని అధికారాలను వినియోగించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ‌ని హైకోర్టు ఆదేశించింది.

  • 13 Feb 2021 07:17 AM (IST)

    అనపర్తిలో బారులు తీరిన మహిళలు

    తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓట్లు వేసేందుకు ఉదయం 6గంటల నుంచే ఓటర్లు భారీ క్యూలైన్లలో బారులు తీరారు.

     

  • 13 Feb 2021 07:05 AM (IST)

    పోలింగ్ కోసం బారులు తీరిన ఓట్లు

    ఎన్నికల రెండో విడత పోలింగ్‌ శనివారం ఉదయం 6:30 గంటలకు మొదలైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తేనే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. సాయంత్రం 3:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 13 Feb 2021 06:50 AM (IST)

    2,786 గ్రామ పంచాయతీలకు పోలింగ్

    రెండో విడత పోలింగ్ జరుగుతున్న గ్రామ సర్పంచి స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్‌ మొదలైంది. ఇందు కోసం వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో పడుతున్నారు.

  • 13 Feb 2021 06:46 AM (IST)

    పార్వతీపురం డివిజన్‌లో మొదలైన పోలింగ్

    ఇవాళ పార్వతీపురం డివిజన్లో‌ రెండో విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పదిహేను మండలాలో ఎన్నికలు జరుగుతున్నాయి. బాడంగి, బలిజిపేట, బొబ్బిలి, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రపురం, సాలూరు, సీతానగరం, తెర్ల మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

Follow us on