Andhra Pradesh: ఇక పండగే.. మందు బాబులకు గుడ్ న్యూస్.. పక్క రాష్ట్రాల కంటే తక్కువ రేట్లు!

AP Liquor Policy: మందు బాబులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి ఆల్‌ బ్రాండ్స్‌. మద్యం ప్రియుల మనసులు ఖుషీ అవాలి. వాళ్ల జేబుకు చిల్లు పడకుండా రేట్లు ఉండాలి. కోరుకున్న బ్రాండ్‌...సరసమైన ధరలకు అందించాలి. ఇదే లక్ష్యంతో ఏపీ సర్కార్‌... ఎక్సైజ్‌ పాలసీని ఖరారు చేయనుంది. సబ్‌ కమిటీ రిపోర్ట్‌ ఇచ్చేసింది. రేపు కేబినెట్‌ ఆమోదంతో... అక్టోబర్‌ 1కి కొత్త లిక్కర్‌ పాలసీ అమల్లోకి రానుంది.

Andhra Pradesh: ఇక పండగే.. మందు బాబులకు గుడ్ న్యూస్.. పక్క రాష్ట్రాల కంటే తక్కువ రేట్లు!
Ap Liquor PolicyImage Credit source: Getty Images
Follow us

|

Updated on: Sep 17, 2024 | 6:56 PM

AP Liquor Policy: మద్యం ప్రియులకు మంచి న్యూస్‌ చెప్పనుంది ఏపీ సర్కార్‌. కొత్త ఎక్సైజ్‌ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానంపై నియమించిన సబ్‌ కమిటీ.. చంద్రబాబుకు తమ రిపోర్ట్‌ అందజేసింది. సబ్‌ కమిటీ సభ్యులైన మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్‌, కొండపల్లి శ్రీనివాస్‌, గొట్టిపాటి రవి బృందం…తెలంగాణ, కర్నాటక సహా 6 రాష్ట్రాల్లో మద్యం పాలసీలను అధ్యయనం చేసింది. పూర్తిగా గవర్నమెంట్‌ మద్యం అమ్మకాలు జరిపే విధానం, పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండే విధానం, గవర్నమెంట్‌-ప్రైవేట్‌ కంబైన్డ్‌ విధానం…ఇలా అన్నీ రకాల పాలసీలపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందించింది సబ్‌ కమిటీ. పలు రాష్ట్రాల మద్యం పాలసీలను సీఎమ్‌కు వివరించారు మంత్రులు. మార్పులుచేర్పులపై సబ్‌ కమిటీతో ముఖ్యమంత్రి చర్చించారని సమాచారం.

పక్క రాష్ట్రాల కంటే తక్కువ రేట్లు!

2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీనే తీసుకు రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే ఎంతో కొంత తక్కువగా మద్యం ధరలు ఉండేలా లిక్కర్‌ పాలసీ ఉంటుందని చెబుతున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్ రిఫండబుల్ ఛార్జీలు, లైసెన్సు రుసుములు ఎలా ఉండాలి? తదితర అంశాలపై ప్రతిపాదనలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇప్పటికే అధ్యయనం చేశారు. ఇక వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లూ అందుబాటులో ఉంచాలని మంత్రుల బృందం తీర్మానించింది. కేబినెట్‌ ఆమోదం తర్వాత…అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీని తీసుకు రానున్నారు.

గత ప్రభుత్వ హయాంలో సర్కారీ దుకాణాల పేరుతో జే బ్రాండ్‌ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మద్యాన్ని సరసమైన ధరలకు అందిస్తామన్నారు.

క్షేత్ర స్థాయి అధ్యయనంతో పాటు సీఎం చంద్రబాబు సూచనలతో కొత్త లిక్కర్‌ పాలసీని రూపొందించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా.. మద్యం అమ్మకాలు ఉండబోతున్నాయన్నారు నాదెండ్ల.

పక్క రాష్ట్రాల ధరలతో పోటీ పడేలా, అందరికీ అందుబాటులో ఉండేలా, లిక్కర్‌ పాలసీలో ప్రతిపాదనలు చేశామన్నారు మంత్రి సత్యకుమార్.

క్వాలిటీకి పెద్ద పీట వేయడంతో పాటు రేట్లు కూడా మందుబాబులకు అందుబాటులో ఉండేలా కొత్త లిక్కర్‌ పాలసీ రూపుదిద్దుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..