AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నేతలపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ఆమె అగ్గిమీదు గుగ్గిలం అయ్యారు. అంతేకాదు.. విషయాన్ని పార్టీ అధినేత జగన్ వద్దకు తీసుకెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని సస్పెండ్ చేయాలని అధినేతను ఆమె కోరారు. ఇదే అంశంపై పార్టీ నేతల సమావేశంలో రోజా తీవ్ర స్వరంతో ప్రసంగించారు. వైసీపీని డ్యామేజ్ చేసేందుకు కొందకు రెబల్స్‌ను పెట్టి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. కేజే చెల్లెలు గౌరీ, కేజే మేనళ్లుడు యువరాజు, కేజే ముఖ్య అనుచరులు కొందరు ఉన్నారంటూ నేరుగా వారి పేర్లను ప్రస్తావించారు రోజా. పార్టీ హై కమాండ్‌కు మాత్రం తాము పోటీ చేయడం లేదని, విత్ డ్రా చేయడానికి సమయం లేదని చెప్పి వదిలేశారని అన్నారు. కానీ ఇప్పుడైమో కేజే తరపున ప్రతి బూతులో ఇద్దరు ఏజెంట్ల చొప్పున కూర్చున్నారని ఆమె ఫైర్ అయ్యారు.
‘కేజే భార్య రాష్ట్ర ఈడిగ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి తీసుకుంటుంది.. ఇక్కడి మున్సిపాలిటీలో నన్ను ఒడించాలని పనిచేస్తున్నారు. వీరంతా 2019 లోనూ నన్ను ఒడించాలని పనిచేశారు. కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడేమో మున్సిపాల్టీల్లో ఒడించాలని చూస్తున్నారు. వాళ్లేమీ చేయలేరు.. ప్రజలు నా వైపు, సీఎం జగన్ వైపు ఉన్నారు. ఇలాంటి చీడ పురుగులు పార్టీలో ఉండకూడదు. ఇప్పటికైనా సీఎం జగన్ వీరిని గుర్తించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. వీళ్లంతా పార్టీకి పట్టిన చీడ పురుగులు. పార్టీలో ఉంటూనే పార్టీ ఓటమికి పనిచేస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారు. వీరందరినీ పార్టీ నుంచి సీఎం వైఎస్ జగన్ బహిష్కరించాలి.’ అని ఎమ్మెల్సీ రోజా అన్నారు.
Also read: