AP MPTC ZPTC Election Results: చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ.. కుప్పం, నారావారిపల్లిలో చేదు ఫలితాలు

AP MPTC ZPTC Election Results: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా మారిపోయాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార

AP MPTC ZPTC Election Results: చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ.. కుప్పం, నారావారిపల్లిలో చేదు ఫలితాలు
Ysrcp, Tdp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 19, 2021 | 1:44 PM

AP MPTC ZPTC Election Results: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా మారిపోయాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగుతోంది. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ ముందంజలో దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం ఆదినుంచే పలుచోట్ల వైసీపీ అభ్యర్థులు పూర్తిగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంతో పాటు ఆయన స్వగ్రామమైన నారావారిపల్లిలోనూ టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

కుప్పంలో మొత్తం 66 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 65 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే.. కుప్పం మండలంలో ఉన్న 17 ఎంపీటీసీల్లో వైఎస్‌ఆర్‌సీపీ 15 విజయం సాధించింది. టీడీపీ 2 ఎంపీటీసీలకు మాత్రమే పరిమితమైంది.

కాగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గ్రామం నారావారిపల్లిలో కూడా వైఎస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. 1347 ఓట్ల మెజారిటితో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. 1347 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. అభ్యర్థి గంగాధరానికి కేవలం 307 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Also Read:

Anil Kumar: టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎన్నికలకు వెళ్దాం.. అచ్చెన్నాయుడుకు మంత్రి అనిల్‌ సవాల్‌

Atchannaidu: ఇవి బోగస్‌ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు.. వైసీపీపై మండిపడ్డ అచ్చెన్నాయుడు