అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగయ్య నామినేషన్ తిరస్కరణపై వివాదం రాజుకుంది. కావాలనే నామినేషన్ రిజెక్ట్ చేశారంటున్న అభ్యర్థి.. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే తిరస్కరించారని ఆరోపించారు. నామినేషన్ వేయకుండానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని అడ్డంకులు దాటుకుని నామినేషన్ వేస్తే తిరస్కరించారని రంగయ్య మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. తాము గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందని గొంతునొక్కుతున్నారని ఆరోపించారు రంగయ్య.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. పట్టభద్రుల క్యాటగిరిలో 63 మంది నామినేషన్ వేయగా 13 తిరస్కరణకు గురయ్యాయి. 50 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉపాధ్యాయ కేటగిరిలో 17 నామినేషన్లు వేయగా 3 తిరస్కరణ గురై 14 మంది బరిలో నిలిచారు. స్థానిక సంస్థల కేటిగిరిలో రెండు ఇద్దరు నామినేషన్ వేయగా.. ఒకటి తిరస్కరణకు గురైంది. వైసీపీ అభ్యర్థి మంగమ్మ ఏకగ్రీవమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..