AP Minister: షెడ్యూల్ కంటే మందే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఏపీ మంత్రి.. పలు సమస్యలపై హామీలు..

|

Jan 06, 2024 | 7:51 AM

ఫస్ట్‌టైమ్‌ గుంటూరు వెస్ట్‌ ప్రజల ముందుకొచ్చారు మంత్రి విడదల రజిని. మనతో మన రజినమ్మ పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఇంకా ఎన్నికల షెడ్యూలే రాలేదు, అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారు మంత్రి విడదల రజిని. సిట్టింగ్‌ సీటు చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కి వైసీపీ అధిష్టానం మార్చడంతో నియోజకవర్గంపై పట్టుపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే, పార్టీ ఆఫీస్‌ను కూడా తెరిచిన విడదల రజిని.. ఫస్ట్‌టైమ్‌ గుంటూరు వెస్ట్‌ ప్రజల ముందుకొచ్చారు.

AP Minister: షెడ్యూల్ కంటే మందే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఏపీ మంత్రి.. పలు సమస్యలపై హామీలు..
Ap Minister Vidatala Rajini
Follow us on

ఫస్ట్‌టైమ్‌ గుంటూరు వెస్ట్‌ ప్రజల ముందుకొచ్చారు మంత్రి విడదల రజిని. మనతో మన రజినమ్మ పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఇంకా ఎన్నికల షెడ్యూలే రాలేదు, అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారు మంత్రి విడదల రజిని. సిట్టింగ్‌ సీటు చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కి వైసీపీ అధిష్టానం మార్చడంతో నియోజకవర్గంపై పట్టుపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే, పార్టీ ఆఫీస్‌ను కూడా తెరిచిన విడదల రజిని.. ఫస్ట్‌టైమ్‌ గుంటూరు వెస్ట్‌ ప్రజల ముందుకొచ్చారు. ఈమధ్య కాలంలో ఈ పార్టీ ఆఫీసుపైనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేసి అద్దాలు ధ్వంసం చేశారని విడదల రజినీ ఆరోపించారు. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రాజకీయంగా పోరాటం చేస్తానన్నారు. తనదైన శైలిలో రాజకీయంగా అన్నింటినీ అధిగమిస్తూ భారీ కాన్వాయ్‌తో ర్యాలీ నిర్వహించారు.

ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు కామన్‌గా చేసే స్టంట్స్‌ అన్నీ చేశారు విడదల రజిని. ప్రజలను పలకరిస్తూ పాదయాత్ర చేశారు. దారిలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలదండలు వేసి, చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. ముత్యాలురెడ్డినగర్‌లో 6కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేసినట్టు చెప్పారు విడదల రజిని. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముత్యాలురెడ్డినగర్‌లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా 16కోట్ల రూపాయల మేర ప్రజలకు లబ్ధి జరిగిందన్నారు రజిని. సుగాలీ కాలనీలో కమ్యూనిటీ హాల్‌, ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..