వైసీపీ ఎమ్మెల్యేలు దానిపై సభలో చర్చ అడిగితే.. చంద్రబాబు రియాక్టై వెళ్లిపోయారు.. మంత్రి బాలినేని వ్యాఖ్యలు

అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందంటూ చంద్రబాబు కన్నీళ్ళు పెట్టుకోవడంపై ఎపి విద్యుత్‌ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు వెక్కి వెక్కి ఏడ్చారో అర్ధం కావడంలేదన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు దానిపై సభలో చర్చ అడిగితే.. చంద్రబాబు రియాక్టై వెళ్లిపోయారు.. మంత్రి బాలినేని వ్యాఖ్యలు
Balineni Srinivas Reddy

Updated on: Nov 20, 2021 | 1:47 PM

అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందంటూ చంద్రబాబు కన్నీళ్ళు పెట్టుకోవడంపై ఎపి విద్యుత్‌ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు వెక్కి వెక్కి ఏడ్చారో అర్ధం కావడంలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే సభ నుంచి వాకౌట్‌ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకుని ఈ విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. వివేకా హత్య విషయంలో చర్చకు చంద్రబాబు డిమాండ్‌ చేస్తే, మాధవరెడ్డి హత్య, వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ హత్య విషయంలో కూడా సభలో చర్చ జరగాలని వైసిపి ఎమ్మెల్యేలు కోరారన్నారు. దీనికి చంద్రబాబు వెంటనే రియాక్టై వాకౌట్‌ చేశారని, స్పీకర్‌ మైక్‌ ఇస్తామన్న వినకుండా వెళ్లిపోయారన్నారు.

కుప్పంలో ఓడిపోయి ప్రస్టేషన్‌లో ఉండి ప్రజల సింపతీకోసం ఈ విధంగా చేశారని మంత్రి బాలినేని తెలిపారు. సియం జగన్‌ మహిళలను సోదరిమణీలుగా భావిస్తారని, అలాంటిది చంద్రబాబు భార్య భువనేశ్వరిపై కూడా ఎవరు మాట్లాడినా సహించమని స్పష్టం చేశారు. టిడిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే వంశీ ఎప్పుడో, ఏదో అన్నాడని చంద్రబాబు ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవడం వెనుక సింపతీ కోసం తాపత్రయంలా కనిపిస్తోందన్నారు. వంశీ నిన్న అసెంబ్లీలో లేరని… అసలు ఆ చర్చే జరగలేదన్నారు. వివేకా విషయంలో జగన్‌పై, ఆయన తల్లి, చెల్లి అంటూ టిడిపి నేతలే మాట్లాడారని ఆరోపించారు. నేతల కుటుంబంలోని మహిళలను ఎవరు కించపర్చినా తప్పేనన్నారు.

గతంలో జగన్‌ సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో టిడిపి కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టినప్పుడు చంద్రబాబు వారిని వారించలేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఇదంతా ప్రజల సింపతీ కోసం చంద్రబాబు పడుతున్న తాపత్రయమని ప్రజలకు కూడా తెలుసని మంత్రి బాలినేని అన్నారు.

Also Read..

BJP Vs Varun Gandhi: బీజేపీ-వరుణ్ గాంధీ మధ్య పెరుగుతున్న గ్యాప్.. 4 డిమాండ్లతో ప్రధాని మోడీకి లేఖాస్త్రం

Nandamuri Balakrishna: ‘అసెంబ్లీలో ఉన్నారా..గొడ్ల చావిడిలో ఉన్నారా’.. వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్