AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rambabu: బ్రో సినిమా ఆర్థిక లావాదేవీలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి మంత్రి అంబటి..

ఏపీ పాలిటిక్స్‌లో కొత్త రచ్చకు తెరలేపింది బ్రో మూవీ.  సినిమాపై చెలరేగిన వివాదం..మనీల్యాండరింగ్‌వైపు డైవర్ట్‌ అయ్యింది. పవన్‌ రెమ్యూనరేషన్‌లో ప్యాకేజీ దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంది.  B.R.Oకి పోటీగా M.R.O సినిమా తీస్తామని అంబటి పేర్కొన్నారు.  M.R.Oకి పోటీగా SSS సినిమా తీస్తామని జనసేన చెబుతోంది. M.R.O అంటే మ్యారేజెస్‌, రిలేషన్స్‌, అఫెండర్‌ అని... SSS అంటే సందులో సంబరాల శ్యాంబాబు అని ఆయా పార్టీలు చెబుతున్నాయి.  అంబటి, జనసేన మధ్య రాజుకున్న సినిమా వివాదం ప్రజంట్ తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. 

Ambati Rambabu: బ్రో సినిమా ఆర్థిక లావాదేవీలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి మంత్రి అంబటి..
Ambati Rambabu
Ram Naramaneni
|

Updated on: Aug 02, 2023 | 4:19 PM

Share

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 1:  బ్రో సినిమా ఆర్థిక లావాదేవీలపై నిఘా సంస్థలకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించిన ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ రాత్రికి ఢిల్లీకు ప్రయాణవుతున్నారు. అయితే ఎవరిని కలుస్తారు, ఏ పని మీద ఢిల్లీ వెళ్తున్నారో చెప్పేందుకు అంబటి రాంబాబు నిరాకరించారు. దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అది తన వ్యూహమని అన్నారు. తన ఢిల్లీ పర్యటనలో తమ ఎంపీ విజయసాయిరెడ్డిని తప్పక కలుస్తానని తెలిపారు. బ్రో సినిమా వివాదం నేపథ్యంలో ఆయన అనేక విషయాలపై మా అసోసియేట్‌ ఎడిటర్‌ హసీనాతో మాట్లాడారు. ఏపీలో మంత్రి అంబటి రాంబాబు వర్సెస్‌ పవన్‌కల్యాణ్‌గా మారిపోయింది. బ్రో సినిమాలో శ్యాంబాబును రాంబాబు పాత్రలో చూపించారనే ఆరోపణలతో మొదలైన వివాదం..వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది.

పవన్‌ నటించిన ఈ బ్రో సినిమా అట్టర్‌ ప్లాఫ్‌ అయ్యిందని సెటైర్లు వేశారు అంబటి. సినిమాలో తన శత్రువులను తిట్టడానికి త్రివిక్రమ్, పవన్ కలిసి సీన్లు పెట్టించారని ఆరోపించారు. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ ద్వారా చంద్రబాబు బ్రో సినిమాలో యాక్ట్ చేసినందుకు ప్యాకేజీ అందజేశారని, ఇదంతా ఓ పెద్దస్కామ్‌ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి స్క్రిప్టు రాస్తే తగిన గుణపాఠం తప్పదని త్రివిక్రమ్‌కు వార్నింగ్‌ ఇచ్చారు అంబటి. మొత్తంగా ఈ వివాదం చినికి, చినికి గాలివానగా మారింది. ప్రజంట్ ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

గమ్మత్తైన ట్వీట్ వేసిన నటి పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ ఎప్పుడూ ట్వీట్ వేసిన దాని వెనుక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా ఆమె ఏపీ పాలిటిక్స్‌ను టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది. పాలిటిక్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌లా తయారయితే, ఎంటర్‌టెయిన్‌మెంట్ పెద్ద సీరియస్‌ టాపిక్ అయిందని ఆమె ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌లో ఎవర్నీ ట్యాగ్ చేయలేదు. ఇక ఎప్పట్లానే కొందరు పూనమ్‌కు మద్దతు నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా చెప్పాలి కానీ ఈ ఇన్‌డైరెక్ట్ ట్వీట్స్ ఏంటని మండిపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..