Andhra Pradesh: ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.!

|

May 06, 2022 | 6:13 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసింది.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.!
Thunderbolt In Ap
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఎన్టీఆర్, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, నందిగామ, పెనుగ్రంచిప్రోలు, వీరుల్లపాడు ప్రాంతాల్లో.. అలాగే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, మర్రిపాడు.. వైఎస్సార్ జిల్లాలోని గోపవరం మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఆ ప్రాంతంలోని పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది. సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Also Read: మాజీ మంత్రి బొజ్జల కన్నుమూత.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, చంద్రబాబు

మరోవైపు ఏపీలో భానుడి భగభగలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో వారికి ఓ ఊరటనిచ్చే వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని.. అది క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామంలో పిడుగుల ధాటికి 2 తాడి చెట్లు దగ్దమవుతున్నాయి. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి