Army chopper crash: హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో ఏపీ వాసి సాయి తేజ్..

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయినట్టు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించింది.

Army chopper crash: హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో ఏపీ వాసి సాయి తేజ్..
Lance Naik Saiteja

Edited By:

Updated on: Dec 09, 2021 | 1:08 PM

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయినట్టు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించింది. బిపిన్‌ రావత్‌ ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టు వెల్లడిచింది. అయితే ఈ ప్రమాదంలో ఏపీ వాసి సాయితేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం.  సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు.

కోయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కానీ అప్పటికే ఆ ప్రాంతమంతా కాలి బూడిదైంది. హెలికాప్టర్ క్రాష్ అవడంతో అందులో ఉన్న వారంతా మాంసపు ముద్దలుగా మారారు. 14 మందిలో ఏకంగా 11 మంది స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Also Read: ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో

 హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత.. ఆయన భార్య కూడా మృతి

 “ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు?” అడిగిన వధువు.. వరుడి ఆన్సర్ వింటే షాకే

 

Follow Us