AP Lawcet 2023: ఏపీ లాసెట్-2023 హాల్‌ టికెట్లు విడుదల.. నేరుగా ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)- 2023 హాల్ టికెట్లు సోమవారం (మే 14) విడుదలయ్యాయి. ఈ మేరకు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటన విడుదల చేసింది. ఏపీ లాసెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న..

AP Lawcet 2023: ఏపీ లాసెట్-2023 హాల్‌ టికెట్లు విడుదల.. నేరుగా ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి
AP Lawcet 2023

Updated on: May 15, 2023 | 7:41 PM

ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)- 2023 హాల్ టికెట్లు సోమవారం (మే 14) విడుదలయ్యాయి. ఈ మేరకు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటన విడుదల చేసింది. ఏపీ లాసెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తన ప్రకటనలో తెల్పింది. విద్యార్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్‌, పుట్టినతేదీ వివరాలతో లాగిన్ అయి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షను మే 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు నిర్వహించనున్నారు. కాగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)- 2023, పోస్టు గ్రాడ్యుయేట్‌ లా కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్‌-2023లను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తోంది. దీనిలో వచ్చిన ర్యాంకు ఆధారంగా లా కోర్సుల్లో యూజీ, పీజీ ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.