
బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రపై ప్రభావం చూపిప్తోంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పడుతున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుతోంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు ఉండడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లోని 11 గ్రామాలకు వరద ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే.. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఇది చదవండి: చేసినవి 27 మూవీస్.. కానీ హిట్స్ మాత్రం రెండు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అరాచకం చూస్తే
మరోవైపు.. ఏపీలో మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారుల అలర్ట్‌తో విశాఖ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్, భీమిలి RDO ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా