Breaking News: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మే 5 నుంచి 23 వరకు ఎగ్జామ్స్..

|

Feb 01, 2021 | 8:35 PM

AP Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు. మే 5వ తేదీ..

Breaking News: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మే 5 నుంచి 23 వరకు ఎగ్జామ్స్..
Follow us on

AP Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు. మే 5వ తేదీ నుంచి మే 23 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మే 5 నుంచి 22 వరకు ఫస్టియర్ పరీక్షలు.. అలాగే మే 6 నుంచి 23 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.  పరీక్షలన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇదే షెడ్యూల్‌ను అమలు చేయనున్నారు. అటు మర్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేసారు. జంబ్లింగ్ విధానం రెండు సెషన్స్ కింద ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. ఇక తెలంగాణలో మే 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 30 శాతం సిలబస్ తగ్గింపు…

కరోనా మహమ్మారి కారణంగా కళాశాలల పనిదినాలను కుదించడం వల్ల ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్‌లో 30 శాతం తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. పూర్తి సమాచారాన్ని అఫీషియల్ వెబ్‌సైట్ bie.ap.gov.inలో ఉంచినట్లు పేర్కొంది.

పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే… 

05-05-2021: సెకండ్ లాంగ్వేజ్

06-05-2021 : సెకండ్ లాంగ్వేజ్ – పేపర్ 2

07-05-2021:  ఇంగ్లీష్ పేపర్ -1

08-05-2021:  ఇంగ్లీష్ పేపర్ -2

10-05-2021:  మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్ 1

11-05-2021: మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2

12-05-2021: మ్యాథ్స్ పేపర్ 1బీ, జూలాజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1

13-05-2021:  మ్యాథ్స్ పేపర్ 2బీ, జూలాజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2

15-05-2021:  ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1

17-05-2021:  ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2

18-05-2021: కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1

19-05-2021: కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2

20-05-2021: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1

21-05-2021: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2

22-05-2021: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1

23-05-2021: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2

Also Read: నిర్మలమ్మ పద్దుతో దేశ ప్రజలకు సమన్యాయం.. మౌలిక సదుపాయాలే లక్ష్యంః ప్రధాని మోదీ