AP Students: ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదిగో

ఏపీలో రాబోయే విద్యా సంవత్సరం 2023–24 కి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది. 75 రోజులు సెలవు దినాలుగా బోర్డు పేర్కొంది. పూర్తి వివరాలు తెలుసకుందాం పదండి.

AP Students: ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదిగో
Andhra Inter Students

Updated on: Apr 28, 2023 | 5:05 PM

2023-24 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. మొత్తం 302 రోజుల్లో.. పని దినాలు 227 రోజులని తెలిపింది. 75 రోజులు సెలవులు ఉంటాయని వెల్లడించింది. క్లాసులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. అకడమిక్ క్యాలెండర్‌కి విరుద్ధంగా ఇంటర్ కాలేజీలు పనిచేసినట్లు తెలిస్తే చర్యలు తప్పవంటూ ఇంటర్ బోర్డు హెచ్చరించింది.  జూలై 26 నుండి 28 వరకు యూనిట్ 1 పరీక్షలు జరుగుతాయని.. ఆగస్ట్ 24 నుండి 26 వరకు యూనిట్ 2 పరీక్షలు ఉంటాయని వెల్లడించింది.  సెప్టెంబర్ 16 నుండి 23 వరకు క్వార్టర్లీ ఎగ్జామ్స్.. అక్టోబర్ 16 నుండి 18 వరకు యూనిట్ 3 పరీక్షల నిర్వహించాలని సూచించింది.

అక్టోబర్ 19 నుండి 25 వరకు దసరా సెలవులు ఉంటాయని..  డిసెంబర్ 18 నుండి 23 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహణ ఉంటుందని ఇంటర్ బోర్డు వెల్లడించింది. జనవరి 11 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది.  జనవరి 19 నుండి 25 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని…  ఫిబ్రవరి రెండో వారంలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం చివరి వర్కింగ్ డే 28-3-2024 అని వివరించింది. 2024 మార్చి 29 నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభమై.. మే 31న ముగుస్తాయని ప్రెస్ నోట్‌లో పేర్కొంది.

Inter Academic Calendar

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..