Vinayaka Chaviti: వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు అనుమతి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..

AP High Court: వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు అనుమతులు ఇచ్చింది. గణేష్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు..

Vinayaka Chaviti: వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు అనుమతి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..
Ap

Updated on: Sep 08, 2021 | 5:57 PM

వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు అనుమతులు ఇచ్చింది. గణేష్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ప్రైవేట్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఒకేసారి ఐదుగురు మించకుండా పూజలు చేసుకోవాలని సూచించింది. అలాగే పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించకూడదని తెలిపింది. అయితే ప్రైవేటు స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉత్సవాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది.

Also Read:

తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!