Chandrababu Arrest: అప్పటివరకు పీటీ వారెంట్‌పై విచారణ వద్దు.. ఏసీబీ కోర్టును ఆదేశించిన ఏపీ హైకోర్టు

|

Oct 16, 2023 | 6:27 PM

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ తిరిగి ఈ నెల 18న జరనుంది. సోమవారం ఇన్నర్ రింగ్ రోడ్ కేసును విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది.

Chandrababu Arrest: అప్పటివరకు పీటీ వారెంట్‌పై విచారణ వద్దు.. ఏసీబీ కోర్టును ఆదేశించిన ఏపీ హైకోర్టు
Chandrababu Naidu
Follow us on

అమరావతి, అక్టోబర్ 16: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ తిరిగి ఈ నెల 18న జరగనుంది. సోమవారం ఇన్నర్ రింగ్ రోడ్ కేసును విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు ఈ నెల 18 వరకు పొడగించింది. అప్పటి వరకు పీటీ వారెంట్‌పై విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఏసీబీ కోర్టును ఆదేశించింది. అయితే, ఈ పిటిషన్‌కు సంబంధించి 500 పేజీల కౌంటర్‌ను సీఐడీ కోర్టుకు సమర్పించింది. మరోవైపు అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో విచారణను హైకోర్టు నవంబర్‌ ఒకటికి వాయిదా వేసింది. అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో ఇప్పటికే విచారణ పూర్తైంది. కానీ, కొత్త ఆధారాలు దొరికాయని కేసు తిరిగి తెరవాలని కోరుతూ సీఐడీ మరో పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఆడియో ఫైల్స్‌ను సీఐడీ హైకోర్టుకు సమర్పించింది. మరిన్ని ఆధారాలు వీడియో రూపంలో అందజేస్తామని ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ వివరించింది. సీఐడీ అధికారులు సమర్పించిన ఆధారాలను హైకోర్టు పరిశీలించింది. అయితే, సీఐడీ పిటిషన్‌ విచారణపై మాజీ మంత్రి నారాయణ తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్పు ఇచ్చే సమయంలో మళ్లీ పిటిషన్‌ సరికాదని వాదించారు. దీనిపై ఏమైన అభ్యంతరాలుంటే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైకోర్టు నవంబర్‌ ఒకటిన చేపట్టనుంది.

మరో వైపు, స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సన్నిహితుడైన కిలారు రాజేశ్‌ను సీఐడీ ప్రశ్నించింది. మొత్తంగా 20-25 ప్రశ్నలు తనను అడిగారని రాజేశ్‌ తెలిపారు. ఇందులో 10- ప్రశ్నలు మాత్రమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించినవని.. మిగిలినవి సంబంధం లేని ప్రశ్నలను అడిగారంటూ రాజేశ్‌ వెల్లడించారు. చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక ఈ కేసు అల్లారంటూ రాజేశ్‌ ఆరోపించారు.

అటు, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కేసులో మాజీ మంత్రి నారాయణ భార్య రమాదేవి, ఆయన బావమరిది రావూరి సాంబశివరావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. 41A కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ నివేదించడంతో ఈ పిటిషన్లను హైకోర్టు డిస్పోజ్‌ చేసింది.

ఇక తనపై మోపిన కేసులు కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..