ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. దీంతో ఈ నెల 13న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం ప్రతినిధులు భేటీ కానున్నారు. ఇక 17న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 15లోగా కంప్లీట్ చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 8న పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి..మార్చి 3వ తేదీ నాటికి వీటిని కూడా పూర్తి చెయ్యనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన ప్రమాణ పత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.