Special ST Commission: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని అన్నారు. గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకువచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారని ఆమె పేర్కొన్నారు.