Input subsidy : రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..నేరుగా బాధిత రైతుల ఖాతాల్లోకి నిధులు
నివర్ తుఫార్ ప్రభావంతో రైతులకు చెప్పుకోలేని బాధను మిగిల్చింది. పంట చేతికి అందుతుంది అన్న సమయంలో విరుచుకుపడింది. వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవన పంటలు పలు జిల్లాల్లో దెబ్బతిన్నాయి.
నివర్ తుఫార్ ప్రభావంతో రైతులకు చెప్పుకోలేని బాధను మిగిల్చింది. పంట చేతికి అందుతుంది అన్న సమయంలో విరుచుకుపడింది. వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవన పంటలు పలు జిల్లాల్లో దెబ్బతిన్నాయి. ఆరుగాలం పండించిన పంట వరదల పాలవ్వడంతో రైతులు పుట్టెడు దు:ఖంలో ఉన్నారు. ఈ క్రమంలో నివర్ తుపాను బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలకు జగన్ సర్కార్ పచ్చా జెండా ఊపింది. రూ.601.66 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం వివరించింది. రాష్ట్రంలోని 7.82 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు పేర్కొంది. మొత్తం 4.59 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఉద్యాన పంటల రైతులకు రూ.44.33 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు జారీ చేసింది. తుపాను వల్ల 26,731 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించింది. బాధిత రైతుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయాలని ఆదేశించింది.
Also Read :