Pawan Kalyan : “వైజాగ్, విజయవాడ, పులివెందుల.. రైతుల కోసం ఎక్కడికైనా వస్తాం”..జనసేనాని పవర్ పంచ్

జనసేనాని పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు.  కలెక్టర్ ఇంతియాజ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పవన్ సోమవారం భారీ ర్యాలీతో మచిలీపట్నం వెళ్లారు.

Pawan Kalyan : వైజాగ్, విజయవాడ, పులివెందుల.. రైతుల కోసం ఎక్కడికైనా వస్తాం..జనసేనాని పవర్ పంచ్
Follow us

|

Updated on: Dec 28, 2020 | 7:10 PM

జనసేనాని పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు.  కలెక్టర్ ఇంతియాజ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పవన్ సోమవారం భారీ ర్యాలీతో మచిలీపట్నం వెళ్లారు. ఇందులో భాగంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు పవన్. రైతులకు మేలు చేయకుంటే మీకున్న 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకని ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు వరద బాధిత రైతులకు రూ. 35వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన కార్యకర్తలతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామన్నారు.  వైజాగ్, విజయవాడ, పులివెందుల ఎక్కడ అసెంబ్లీ సమావేశాలు పెడితే అక్కడికి వస్తామన్నారు. వకీల్ సాబ్ వచ్చాడనే విషయాన్ని మీ సీఎంకు చెప్పండి అంటూ పంచ్ డైలాగ్‌లు పేల్చారు పవన్. తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని హెచ్చరించారు.

రాష్ట్ర ఉత్పత్తిలో 40శాతం రైతు నుంచే వస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  మంత్రి పదవిని కాపాడుకునేందుకు తనపై మంత్రి పేర్ని నాని విమర్శలు చేస్తున్నారని అన్నారు.  రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టానని… ఎన్నికల్లో ఓటమి చెందినా తాను వెనకడుగు వేయలేదని చెప్పారు.  తాను సినిమాలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పేకాట క్లబ్బులు నడిపిస్తూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు సంధించారు. సీఎం జగన్‌కు పరిశ్రమలు లేవా.. వ్యాపారాలు లేవా..అని ప్రశ్నించారు.

Also Read : 

Yerragondapalem jr ntr flex : “ఏపీకి నెక్ట్స్ సీఎం తారక రామారావే”..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫ్లెక్సీ

 Tiruchanur railway station : శ్రీవారి చెంత మరో రైల్వే స్టేషన్.. ‘బి’ క్లాస్ స్టేషన్‌గా‌ తిరుచానూరు..సకల సౌకర్యాలతో భవనం