AP CM YS. Jagan: ఏపీలోని వైయస్.జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అగ్రవర్ణాలకు చెందిన పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ రిజర్వేషన్ విద్యా, ఉద్యోగాల్లో విషయాల్లో వర్తించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను జగన్ సర్కార్ మరింత మరింత సరళతరం చేసింది. దీంతో ఎక్కువ మంది అగ్రవర్ణ పేదలకు మేలు జరగనున్నదని తెలిపింది. కుటుంబ వార్షిక ఆదాయం 8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. అంతేకాదు మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి కూడా పెంచుతూ పెంచిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న రూ.6లక్షల ఆదయ పరిమితిని 8లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా వైసీపీ సర్కార్ మెమో జారీ చేసింది. ఇప్పటికే ఈ మేరకు రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలకు మెమోద్వారా అధికారిక సమాచారం ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఈ అగ్రవర్ణ పేదలకు చెందిన రిజర్వేషన్ల కోటాలో మహిళలకు కూడా మూడోవంతు కోటా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: Gold and Silver Price : పరుగులు పెడుతున్న పసిడి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర