YSR Nethanna Nestham 2021: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలు కోసం ఉత్తర్వులు..

2021-22 ఆర్ధిక సంవత్సరానికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు...

YSR Nethanna Nestham 2021: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలు కోసం ఉత్తర్వులు..
CM YS Jagan

Updated on: Jun 25, 2021 | 8:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎశ్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ మరో మైలురాయిని చేరింది.  అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో, దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే ఆయా పథకాలు చేరువ చేశారు. వలంటీర్లు, సచివాలయాల్లో అందచేసిన దరఖాస్తును నిర్థిష్టమైన కాలపరిమితిలో పరిష్కరించడం, లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్ ఆడిట్ చేస్తున్నారు. ఎక్కడైనా అర్హులు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెబితే, వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

అయితే 2021-22 ఆర్ధిక సంవత్సరానికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసింది AP సర్కార్. లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసిన ప్రభుత్వం. 2020-21 సంవత్సరంలో ఆర్ధిక సాయం అందుకున్న వారి జాబితా ప్రకారం సమాచారాన్ని క్రోడీకరించాలని సూచించింది. జూలై 27 తేదీ నాటికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా స్పష్టం చేసింది ప్రభుత్వం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికుల కుటుంబాలకు 24 వేల ఆర్ధిక సాయం అందించనున్నట్టు స్పష్టం చేసింది రాష్ట్ర సర్కార్.

ఇవి కూడా చదవండి : రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!

సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ..