Fact Check: ఆ ప్రభుత్వ పథకాలు ఈ ఏడాది రద్దు అంటూ కథనాలు.. ఏపీ సర్కార్ క్లారిటీ

|

Jun 01, 2022 | 1:28 PM

జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు ఈ ఏడాది రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రెండు రోజులుగా ప్రభుత్వ ఉత్తర్వుల పేరుతో ఓ నోట్ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ అంశంపై ఏపీ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది.

Fact Check: ఆ ప్రభుత్వ పథకాలు ఈ ఏడాది రద్దు అంటూ కథనాలు.. ఏపీ సర్కార్ క్లారిటీ
Ap Govt
Follow us on

AP Government: ఏపీ సర్కార్ ప్రజలకు సంక్షేమం అందించడంలో రాజీ లేకుండా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఆర్థిక ఇబ్బందుల సమయంలోనూ పథకాల విషయంలో ప్రభుత్వం వెనకంజ వేయలేదు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ‘జగనన్న అమ్మఒడి( Amma Vodi), ‘వాహన మిత్ర'( Vahana Mitra) చాలా ముఖ్యమైనవి. అయితే ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ స్కీమ్స్ రద్దు అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీటిపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అటువంటి ఖాతాలను గుర్తించి సైబర్ క్రైం చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ జీవోలను, లోగోలను మార్పింగ్ చేసి బురదజల్లే ప్రయత్న చేస్తున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఇలా తప్పుడు కథనాలు వండి వార్చుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రభుత్వంపై అసత్య ప్రచారంపై సీఐడీ కేసులు కేసు నమోదు చేసింది. ఐదుగురిపై అండర్ సెక్షన్ 7 ఆఫ్ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 2005, సెక్షన్ 3 ఆఫ్ ద ఎంబ్లమ్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950, సెక్షన్ 66C ఆఫ్ ఐటీ యాక్ట్ 2000, ఐపీసీ సెక్షన్ 505(1), 464, 465, 466, 469, 471, 474, 500 ప్రకారం కేసు నమోదు చేసింది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం బుర్రిపాలెంకు చెందిన దాసరి కోటేశ్వరరావు (28), గుంటూరు జిల్లా తెనాలి వాసి పర్చూరి రమ్య (31), బాపట్ల జిల్లా వేమూరు వాసి కోగంటి శ్రీనివాసరావు (46), మరికొందర్ని ఈ కేసులో నిందితులుగా చేర్చింది. విచారణకు హాజరు కావాలని కోరుతూ.. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41ఏ కింద వీరికి నోటీసులిచ్చింది. వారు విచారణకు హాజరయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి