ఏపీలో ‘ఉల్లి’కోసం బారులు తీరిన జనం..!

| Edited By:

Nov 23, 2019 | 1:01 PM

ఏంటి ఉల్లి రేటు అంత ఘాటుగా ఉంటే.. ఏపీలో దాని కోసం బారులు తీరడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు. ఉల్లి మామూలుగా కన్నీళ్లు పెట్టించడంలేదు. దాని ఘాటుకి.. జనాలు కనీసం కొనే ధైర్యం కూడా చాలడం లేదు. కిలో వంద రూపాయలకు పైగానే ఉల్లి ధర పలుకుతోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అందులోనూ.. పెళ్లి ముహుర్తాలు ఉన్న కారణంగా.. చాలా మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో.. ఏపీ ప్రభుత్వం […]

ఏపీలో ఉల్లికోసం బారులు తీరిన జనం..!
Follow us on

ఏంటి ఉల్లి రేటు అంత ఘాటుగా ఉంటే.. ఏపీలో దాని కోసం బారులు తీరడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు. ఉల్లి మామూలుగా కన్నీళ్లు పెట్టించడంలేదు. దాని ఘాటుకి.. జనాలు కనీసం కొనే ధైర్యం కూడా చాలడం లేదు. కిలో వంద రూపాయలకు పైగానే ఉల్లి ధర పలుకుతోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అందులోనూ.. పెళ్లి ముహుర్తాలు ఉన్న కారణంగా.. చాలా మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

దీంతో.. ఏపీ ప్రభుత్వం ఉల్లిపాయల మీద రాయితీ తీసుకొచ్చింది. కిలో ఉల్లిని రూ.25 రూపాయలకే ప్రజలకు అందిస్తుంది. అందుకే.. ప్రజలు రైతు బజార్ల వద్ద ఉదయాన్నే బారులు తీరారు. కానీ.. ఒక మనిషికి.. ఒక కిలో చొప్పునే ఇస్తున్నారు. మహారాష్ట్ర నుంచి 300ల టన్నుల ఉల్లిని రూ.30ల చొప్పున కొనుగోలు చేశామని.. వాటిని రైతు బజార్లలో రూ.25కే అందిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

కాగా.. మరో నెల రోజుల పాటు ఈ పాట్లు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా.. ఉల్లి దిగుబడి తగ్గిన కారణంగానే ఈ సమస్య ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. అయినా.. ఉల్లి అందుబాటులోనే ఉందని.. కానీ కొంతమంది దళారులు కావాలనే ఉల్లి కొరతను సృష్టిస్తున్నారని వారు చెబుతున్నారు. అయితే.. ఉల్లి ధర పెరిగినందుకు మాత్రం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తక్కువైనా.. ధర అధికంగా ఉండటంతో.. పండిన పంటకు గిట్టుబాటు అయ్యిందని సంతోషం వ్యక్తం చేస్తోన్నారు రైతులు.