Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పదోతరగతి పరీక్షా విధానంలో మార్పులు

|

Aug 22, 2022 | 6:06 PM

పదవ తరగతి విద్యార్థులపై భారాన్ని తగ్గించేందకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా పేపర్లను 6కు కుదిస్తున్నట్లు వెల్లడించింది.

Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పదోతరగతి పరీక్షా విధానంలో మార్పులు
Ap Ssc Exams
Follow us on

AP SSC Exams: పదోతరగతి పరీక్షా విధానంలో కీల‌క మార్పులు చేసింది ఏపీ సర్కార్. టెన్త్ క్లాసుకు సంబంధించి ఇకపై 6 పరీక్షలే నిర్వహించాలని డిసైడయ్యింది. 2022-23 అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమలు చేయాలని అధికారులకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. గ‌తంలో 11 పేప‌ర్లు ఉండగా కోవిడ్ కారణంగా మధ్యలో 7 పేపర్లకు కుదించింది ప్రభుత్వం. తాజాగా CBSC సిలబస్ దృష్ట్యా 6 పేప‌ర్లే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.  ఫిజిక‌ల్, బ‌య‌లాజిక‌ల్ సైన్స్‌కు ఒకే ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.  స్టూడెంట్స్‌పై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానం తెచ్చామని అధికారులు చెబుతున్నారు. ఏడాదంతా ఎగ్జామ్స్ జరపడం వల్ల 11 పేపర్లు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..