రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా సంక్షోభంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు అన్ని శాఖల్లోని ఉద్యోగాల ఖాళీల వివరాలను తేల్చాలని సీఎస్ అదిత్యనాధ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అన్ని శాఖల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను మే 31వ తేదీన విడుదల చేస్తామని సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ స్పష్టం చేశారు.
మరోవైపు భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్‌లైన్‌లో డైరెక్టర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ పర్సనల్ వెబ్‌సైట్‌లో లభ్యమయ్యేలా చూడాలని సీఎస్ పేర్కొన్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులలో ప్రాధ్యానత ప్రకారం దశల వారీగా వాటిని భర్తీ చేయాలని.. ఏయే ఖాళీలను ముందుగా భర్తీ చేయాలో సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచించాలన్నారు. అటు యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలలోని ఖాళీల వివరాలను హెచ్‌ఆర్ఎంఎస్‌లో పొందుపరచాలని తెలిపారు.
Also Read:
తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..
ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ వాయిదా..