Andhra Pradesh: ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. కానీ ఆ ఆంక్షలు యథాతథం

|

Feb 14, 2022 | 6:18 PM

AP Corona News: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కరోనా ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించింది.

Andhra Pradesh: ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. కానీ ఆ ఆంక్షలు యథాతథం
Ap Night Curfew
Follow us on

AP Night Curfew: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కరోనా ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించింది. మాస్క్‌లు కచ్చితంగా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. షాపుల్లో, మాల్స్‌లో కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. ఫీవర్‌ సర్వే(Fever Survey) కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను డివైడ్ చేయాలని సీఎం ఆదేశించారు. పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి ఆదేశించారు. నేటి వరకు రాష్ట్రంలో 3,28,46,978 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో కరోనా కేసుల వివరాలు

ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గింది. భారీగా తగ్గిన కొత్త కేసులు, యాక్టివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 15,193 మందికి కరోనా టెస్టులు చేయగా 434 మందికి కరోనా సోకినట్లు తేలింది. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూరు ఒకరు మరణించారు. గడచిన 24 గంటల్లో 4,636 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

  • ఏపీలో మొత్తం కరోనా కేసులు: 2313212
  • ఏపీలో ఇప్పటివరకు కరోనా మరణాలు: 14698
  • ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు: 14726
  • ఏపీలో ఇప్పటివరకు కరోనా రికవరీల సంఖ్య: 2283788

Also Read: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో

డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్‌ అడిగిన ఐఏఎస్‌..! ఆరా తీస్తే అసలు బాగోతం తెలిసింది