Andhrapradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. కిట్ల అందజేతపై కీలక నిర్ణయం

| Edited By: Ram Naramaneni

Jan 05, 2022 | 4:27 PM

Andhrapradesh: విద్యార్థుల విషయంలో ఏపీ సర్కార్‌ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను..

Andhrapradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌..  కిట్ల అందజేతపై కీలక నిర్ణయం
Follow us on

Andhrapradesh: విద్యార్థుల విషయంలో ఏపీ సర్కార్‌ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు ఆర్థిక అవసరాలను సైతం తీరుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ‘జగనన్న విద్యాదీవెన’ కిట్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల్లోనే విద్యాదీవెన కిట్లను పాఠశాలలకు చేర్చాలని అధికారులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ఖరారు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సంబంధిత ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకుని ఆర్డర్లను జారీ చేయాలని మంత్రి సూచించారు.

అమ్మ ఒడి, విద్యాదీవెను పథకాలకు అర్హుల జాబితా సిద్ధం చేయండి:
ఇక అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాలకు సంబంధంచి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. జగనన్న విద్యాదీవెన కిట్లలో మూడు జతల యూనిఫామ్‌లు, షూస్‌, సాక్సులు, బెల్ట్‌, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బాగు ఉంటాయి. మరో వైపు పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విద్యాదీవెన స్కీమ్‌ కింద ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్థులకు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఇలా జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. పేద విద్యార్థులను ఆదుకునే విధంగా పలు పథకాలను ప్రవేశపెడుతూ అండగా నిలుస్తున్నారు సీఎం జగన్‌.

ఇవి కూడా చదవండి:

Ram Gopal Varma: తగ్గేదే.. లే.. “థ్యాంక్యూ నాని గారూ” అంటూనే మరో బాణాన్ని సందించిన వర్మ..

Earthquake: సిక్కింలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు