“మా” ఎన్నికల హీట్ పీక్ స్టేజ్‌కు చేరిన వేళ ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. అక్టోబరు 10న జరిగే ‘మా’ ఎన్నికలపై ప్రభుత్వానికి, జగన్‌కు ఏ మాత్రం ఆసక్తి, ఉత్సాహం లేదని అన్నారు. ఈ అంశాన్ని తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రస్తుతం జరగుతోన్న ‘మా’ ఎన్నికల్లో సీఎం జగన్ బంధువు మంచు విష్ణు అధ్యక్ష బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకాశ్ రాజ్‌కు అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రజంట్ ‘మా’ ఎన్నికలు జగన్ వర్సెస్ పవన్ అంటూ కొందరు వార్తలు సర్కులేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ తమకు ‘మా’ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని.. కనీసం ఆసక్తి కూడా లేదంటూ ప్రకటించింది.
సాదాసీదాగా సాగే ‘మా’ ఎన్నికల్లోకి రాజకీయ నేతలను ఎందుకు లాగుతున్నారు: ప్రకాశ్ రాజ్
‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ స్పీడ్ పెంచారు. పెద్దల మద్దతు వద్దంటూనే ‘మా’కి ఏమేం కావాలో క్లిస్టర్ క్లియల్‌గా క్లారిటీ ఇచ్చారు. నాన్ లోకల్, గెస్ట్, తెలుగోడు అంటూ ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్లకు తనదైన స్టయిల్‌లో కౌంటర్ ఎటాక్‌కి దిగారు. నేను మోనార్క్‌ని.. నేనెవరికీ భయపడనన్నారు. అంతవరకు ఓకే కానీ.. ప్రశ్నిస్తే వార్నింగ్‌లు ఇచ్చారని ఆయన చేసిన కామెంట్సే ఇప్పుడు ‘మా’ ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. తనను నాన్ తెలుగోడు అనడంపై మండిపడ్డారు ప్రకాష్. నేషనల్ అవార్డ్ తీసుకొచ్చిన తనను ఎందుకలా విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. చదువులేని నరేష్‌కి అన్ని కామేడిగానే కనిపిస్తున్నాయని సెటైర్లు వేశారు. సాదాసీదాగా సాగే ‘మా’ ఎన్నికల్లో సడెన్‌గా రాజకీయ నాయకుల్ని ఎందుకు లాగుతున్నారని నిలదీశారు. మా ఎన్నికలకు మరో ఏడు రోజుల గడువు ఉంది. రెండు ప్యానళ్లు ఇప్పటిదాకా మేనిఫెస్టోలు ప్రకటించలేదు. కానీ మాటల మంటలు మాత్రం అగ్గిరాజేస్తున్నాయి. విష్ణు అండ్ కో అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రకాష్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
ఇక మా ఎన్నికలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ సర్కార్ ప్రకటన చేయడంతో ప్రకాశ్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు, మంత్రి పేర్ని నానికి థ్యాంక్స్ చెప్పారు.
#MAAElections ?????? thank you honourable chief minister YS Jagan Garu and honourable minister PERNI NANI garu.. much obliged #Respect pic.twitter.com/uEc4YugpwP
— Prakash Raj (@prakashraaj) October 4, 2021
Also Read: ‘రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్’.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే.. పూర్తి వివరాలు