AP Curfew: ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. జూలై 1 నుంచి వర్తింపు.. ఆ ఐదు జిల్లాల్లో మాత్రం యధాతధం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి కొనసాగుతున్న కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 1వ తేదీ నుంచి 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నట్లు..

AP Curfew: ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. జూలై 1 నుంచి వర్తింపు.. ఆ ఐదు జిల్లాల్లో మాత్రం యధాతధం
Jagan

Updated on: Jun 28, 2021 | 1:53 PM

కరోనా కట్టడి నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న 8(అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం) జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జూలై 1వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా.. రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే కరోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కంటే ఎక్కువ ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలే కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని.. అటు రాత్రి 6 గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలు అవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా, జూలై 1 నుంచి 7 వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి.

మరోవైపు జూలై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపులు ఉన్న నేపథ్యంలో బ్యాంకుల టైమింగ్స్‌లోనూ మార్పులు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లోని బ్యాంకులు అన్ని కూడా ఎప్పటిలానే సాధారణ సమయాల్లో పని చేసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన ఐదు జిల్లాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి 

Loading...
Unable to load recommendations.
Follow Us