Sajjala: ఇళ్లల్లో కరెంటు వాడకం తగ్గించండి.. ఆంధ్రాలో విద్యుత్ కోతలపై సజ్జల క్లారిటీ

|

Oct 11, 2021 | 4:03 PM

ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాల పై కోర్టుకు వెళ్లి స్టే తేవడం వెనుక టీడీపీ కుట్ర ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala: ఇళ్లల్లో కరెంటు వాడకం తగ్గించండి.. ఆంధ్రాలో విద్యుత్ కోతలపై సజ్జల క్లారిటీ
Sajjala
Follow us on

Sajjala Ramakrishna Reddy: ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాల పై కోర్టుకు వెళ్లి స్టే తేవడం వెనుక టీడీపీ కుట్ర ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరిట లబ్దిదారులకు తెలియకుండా కొందరు హైకోర్టులో కేసు వేయించారని ఆయన అన్నారు. రాజకీయ శక్తులు తెర వెనక ఉండి పన్నాగంతో దుష్టక్రీడకు తెరతీశాయన్నారు. 31 లక్షల మందికి గృహ నిర్మాణాల్ని చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారిందని సజ్జల చెప్పుకొచ్చారు.

కోర్టుల్లో అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటోందని సజ్జల అన్నారు. హైకోర్టు సింగిల్ బెంచి ఆదేశాలపై డివిజన్ బెంచ్‌కు వెళతామని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా దేశీయంగా బొగ్గు లభ్యత లేకపోవడం, వాటి రేటు పెరగడం వల్ల విద్యుత్ సమస్య వచ్చిందన్న ఆయన, డబ్బు పెట్టినా సమస్యను తీర్చే పరిస్థితి లేదన్నారు.

ఇళ్లలో కరెంటు వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నామని సజ్జల అన్నారు. ప్రజలు రాత్రి 6-8 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. విద్యుత్ విషయంలో కేంద్ర మంత్రి చెప్పిన అంశంలో వాస్తవం లేదని సజ్జల అన్నారు. అలాగే రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉంటాయని కూడా సజ్జల స్పష్టం చేశారు.

Read also: Home Guard Cheating: ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్లో పనిచేస్తోన్న హోంగార్డు వాణి లీలలు..!