Andhra Pradesh: పోస్ట్‌ ఎప్పటిదని కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా..! తెరపై గ్రేడ్-2 నేతలే.. మున్ముందు ఇంకెవరో..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సోషల్ మీడియా పోస్టింగ్స్‌, అరెస్టులు షేక్ చేస్తున్నాయి. నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో సహా గతంలో షర్మిల, సునీత, విజయమ్మపై పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని కడప పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Andhra Pradesh: పోస్ట్‌ ఎప్పటిదని కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా..! తెరపై గ్రేడ్-2 నేతలే.. మున్ముందు ఇంకెవరో..?
Social Media Politics

Updated on: Nov 12, 2024 | 9:45 PM

సోషల్‌ మీడియా అంటేనే ఉలిక్కిపడుతున్నారు కొంతమంది. ముఖ్యంగా ఏపీలో..! పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌ అయిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ కొత్త మార్పు అయితే కనిపిస్తోంది. ఎంత వరకు నిజమో గానీ.. 15వేల మందికి నోటీసులు. ఏకంగా 200 మంది వరకు అరెస్ట్. ఒక్కొక్కరిపై కనీసం 20కి పైగా కేసులు. ఇదీ ప్రస్తుత పరిస్థితి అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్‌ చేస్తే.. ఏకంగా పార్టీ మొత్తం కదిలిపోతోంది. ప్రతిపక్ష నేతలు రోడ్లపైకి వస్తున్నారు. ఒక ప్రజా సమస్యపై స్పందించడానికో, ఓ ఆందోళన చేయడానికో, ఓ ఉద్యమం నడపడానికి కూడా రానివాళ్లంతా పరిగెత్తుకొస్తున్నారిప్పుడు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్‌ చేస్తే అంత ఉలికిపాటా? ఎందుకని..? వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే.. ఆ లింక్‌ సజ్జల నుంచి ఎంపీ అవినాశ్‌రెడ్డి మీదుగా ఇంకెటో వెళ్తోంది. అసలేం జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో..? ఈ సోషల్‌ మీడియా అరెస్టులు ఇంకెంత దూరం వెళ్తాయి..? అసలు టార్గెట్‌ ఎవరు? ఫుల్‌ డిటైల్స్‌.. ఒక్క పోస్ట్‌ పెడితే.. అరెస్ట్‌ చేసేస్తారా? ఫలానా వ్యక్తికి ప్రభుత్వ విధానం నచ్చింది.. పోస్ట్‌ పెట్టాడు. ఇంకొకరికి నచ్చలేదు.. దాని మీదా పోస్ట్‌ పెట్టాడు. తప్పేముంది అందులో. అభిప్రాయం చెప్పడమే కదా. అంత మాత్రానికే అరెస్ట్‌ చేస్తారా? భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తారా? అభిప్రాయం చెబితే ఎవరూ ఏమీ అనరు. కాని, అంతకు మించి జరుగుతోందే..! అది కదా ప్రాబ్లమ్ ఇక్కడ. ‘రుషులు యజ్ఞయాగాదులు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి