Devineni Uma Released: పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌ నుంచి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా విడుదల

Devineni Uma Released: బెజవాడ రాజకీయం వేడెక్కింది. గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు యత్నించిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా

Devineni Uma Released: పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌ నుంచి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా విడుదల
Devineni Uma

Updated on: Jan 19, 2021 | 5:54 PM

Devineni Uma Released: బెజవాడ రాజకీయం వేడెక్కింది. గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు యత్నించిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు.. కొద్ది సేపటి కిందట విడుదల చేశారు. పమిడిముక్కల పోలీసు స్టేషన్‌ నుంచి ఉమా మహేశ్వరరావు విడుదలయ్యారు. అయితే ఉమాను అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఏపీ మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమాను ఉద్దేశించి విమర్శలు చేశారు. మంత్రి వ్యాఖ్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమా.. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మంగళవారం నిరసన దీక్షకు చేపడతానని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్‌ విసిరారు. ఈ మేరకు మంగళవారం గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు టీడీపీ శ్రేణులతో కలిసి ఉమా చేరుకున్నారు. ఉమా దీక్షకు సిద్ధమవుతుండగా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ శ్రేణులతో అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గందరగోళం మధ్య దేవినేని ఉమా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బైఠాయించారు.

ఈ కారణంగా పరిస్థితిని అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు ఉమాను అరెస్టు చేశారు. పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా, ఈలప్రోలు వద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవినేని ఉమాను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అరెస్టు అనంతరం ఆయనను పోలీసులు విడుదల చేశారు.

Also Read: Jagan Delhi Tour Live: సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్.. రాత్రి 9 గంటలకు అమిత్ షాతో కీలక భేటీ..