Andhra Pradesh: దేవినేని ఉమ ఇంట విషాదం.. గుండె పోటుతో మాజీ మంత్రి తండ్రి కన్నుమూత..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ తుదిశ్వాస విడిచారు.

Andhra Pradesh: దేవినేని ఉమ ఇంట విషాదం.. గుండె పోటుతో మాజీ మంత్రి తండ్రి కన్నుమూత..

Updated on: Dec 03, 2021 | 11:38 AM

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ తుదిశ్వాస విడిచారు. విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గుండె పోటుతో చేరిన ఆయన కోలుకోలేక కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా శ్రీమన్నారాయణ వయస్సు 88 సంవత్సరాలు. కంకిపాడు మండలం నెప్పల్లి ఆయన స్వగ్రామం కాగా.. కంచికచర్లలో స్థిరపడ్డారు. ఆయనకు మొత్తం నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా పాల్గొనకపోయినప్పటికీ దివంగత దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమ ఎన్నికల ప్రచారంలో పలుసార్లు పాల్గొన్నారు. కాగా నేడు కంచికచర్లలో శ్రీమన్నారాయణ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చంద్రబాబు సంతాపం..
శ్రీమన్నారాయణ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీమన్నారాయణ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు తెలిపారు. దేవినేని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరితో పాటు పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక శ్రీమన్నారాయణ మరణవార్త విన్న దేవినేని అవినాష్‌.. విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు.

Also read:

Special Idli: విశాఖ యువకుడి స్పెషల్‌ ఇడ్లీకి.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫిదా..! ఎట్రాక్ట్ చేస్తున్న ఇడ్లి..(వీడియో)

Andhra Pradesh: ఆ నిందితుడి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు.. తమకే అప్పగించాలని వినతుల వెల్లువ.. ఇంతకీ అతను ఎవరంటే..

Andhra Pradesh: మద్యం బాటిల్‌లో చెత్తాచెదారం, పురుగులు.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..