Andhra News: రామ్ గోపాల్ వర్మకు రూ. కోటి 15 లక్షలు ఇచ్చారు.. 15 రోజులే గడువు ఇస్తున్నాం: జీవీ రెడ్డి

|

Dec 24, 2024 | 7:52 PM

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 ఉద్యోగులను తొలగించబోతున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సంస్థకు నష్టం కలిగించిన వారిని నుంచి డబ్బు రికవరీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా రామ్‌గోపాల్‌ వర్మ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు జీవీ రెడ్డి.. ఈ విషయంలో డబ్బు రికవరీ కోసం నోటీసులు పంపామన్నారు.

Andhra News: రామ్ గోపాల్ వర్మకు రూ. కోటి 15 లక్షలు ఇచ్చారు.. 15 రోజులే గడువు ఇస్తున్నాం: జీవీ రెడ్డి
Ap Fiber Net Issue
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 ఉద్యోగులను తొలగించబోతున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సంస్థకు నష్టం కలిగించిన వారిని నుంచి డబ్బు రికవరీ చేస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ ఫైబర్‌ నెట్‌ను దివాళా తీయించే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు సంస్థ చైర్మన్‌ జీవీరెడ్డి. 2019-2024 మధ్య అవసరం లేకున్నా 1200 మందిని నియమించుకున్నారని తెలిపారు. వైసీపీ నేతలు చెప్పడంతో అప్పటి చైర్మన్ వీరిని రిక్రూట్ చేసుకున్నారని వివరించారు. ఇందులో చాలామంది నాటి ఎంపీ, ఎమ్మెల్యేల ఇంట్లో పనిచేశారని ఆరోపించారు. సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 ఉద్యోగులను తొలగించబోతున్నామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్‌ లో ఈ నియమకాలు చేపట్టిన వారికి త్వరలోనే లీగల్ నోటీసులు ఇస్తామన్నారు జీవీ రెడ్డి. వారిని నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేయడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు జీవి రెడ్డి.. త్వరలో మరిన్ని రికవరీలు ఉంటాయని తెలిపారు.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు..

రామ్‌గోపాల్‌ వర్మ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు జీవీ రెడ్డి. రామ్ గోపాల్ వర్మకు రూ. కోటి 15 లక్షలు ఇచ్చారని.. తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌కు వ్యతిరేకంగా మరో 15 సినిమాలు ప్లాన్ చేశారని.. ప్రభుత్వం మారడంతో వారి ప్లాన్ వర్కవుట్ కాలేదని తెలిపారు. తీసుకున్న డబ్బును చెల్లించేందుకు వర్మకు 15 రోజుల గడువు ఇచ్చామన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైబర్‌ నెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది.

ఉద్యోగుల తొలగింపు కక్షసాధింపు చర్య- అంబటి

అయితే ఫైబర్ నెట్‌లో ఉద్యోగుల తొలగింపు అంశాన్ని కక్షసాధింపు చర్యగా అభివర్ణించింది వైసీపీ. వైసీపీ మీద కోపం ఉంటే తమతో పోరాడాలని.. కానీ తమ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు తొలగించడం ఏంటని మాజీమంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వాలంటీర్లకు ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శలు గుప్పించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..