YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెంచింది.. తాజా అప్‌డేట్ ఇది

|

Jun 11, 2021 | 5:41 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కరోనా నేపథ్యంలో ఇటీవల దర్యాప్తు కాస్త నెమ్మదించింది...

YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెంచింది.. తాజా అప్‌డేట్ ఇది
Cbi Speeds Up Investigation On Ys Vivekananda Reddy Case
Follow us on

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కరోనా నేపథ్యంలో ఇటీవల దర్యాప్తు కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో సీబీఐ అధికారులు గత ఐదురోజులుగా కడపలో మకాం వేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివేక హత్య కేసులో పలువురు అనుమానితులను మాత్రమే ప్రశ్నిస్తున్న సీబీఐ….ఇప్పుడు కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ ని కూడా విచారించింది. కేసులో పలు వాహనాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో సంచరించిన వాహనాలకు సంబంధించిన వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్‌ యాదవ్‌ వరుసగా మూడో రోజు కూడా హాజరయ్యారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సైతం ఐదో రోజు విచారించారు. దర్యాప్తులో పలు కీలక అంశాలను అధికారులు రాబట్టినట్లు సమాచారం. ఓ బృందం కడపలో అనుమానితులను విచారిస్తుండగా మరో రెండు బృందాలు పులివెందుల చేరుకున్నాయి. వివేకా ఇంటి పరిసరాలను మరోసారి పరిశీలించారు. కిరణ్‌ కుమార్‌ యాదవ్‌ ఇంటిని కూడా సీబీఐ బృందం పరిశీలించింది.

గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమీషనర్ గా బసి రెడ్డి ఉండేవారు. ఇప్పుడు ఆయన మరో జిల్లాకి బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయన స్థానంలో జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి నాగేశ్వర్ రావు ఉన్నారు. దీనితో జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్, వెహికల్ బ్రేక్ బ్రేక్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ట్రాన్స్ పోర్టు సిబ్బంది హాజరు అయ్యారు. ఏదైనా ఒక వెహికల్ కి సంబంధించి పూర్తి వివరాలు, వెహికల్ ఫుల్ డేటా కమిషనర్ దగ్గర ఉంటుంది కాబట్టి అతని దగ్గర నుంచి కీలక వివరాలను తెలుసుకుంటున్నారు.. గురువారం సీబీఐ అధికారులు ఎదుట 10 నిమిషాలు హాజరు అయ్యి డిప్యూటీ కమిషనర్ తిరిగి వెళ్లిపోయారు. అనంతరం సీబీఐకి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం కోసం ట్రాన్స్ పోర్టు సిబ్బంది అక్కడే ఉన్నారు.

సీబీఐ అధికారులు ఏమని ప్రశ్నించారని డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమీషనర్ నాగేశ్వర్ రావుని వివరణ అడగ్గా చెప్పడానికి నిరాకరించారు. విచారణకి పిలిచిన మాట వాస్తవమే …కానీ ఎలాంటి వివరాలు అడిగారన్నదానిపై బయటకు చెప్పకూడదన్నారు. ఏమైనా కీలక సమాచారం లభించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకానంద హత్య ముందు ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగిన వాహనాలు వివరాలు తెలిస్తే కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కేంద్రం గా విచారణ కొనసాగుతుంది.

Also Read: కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి.. పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ

 స్విగ్గీ డెలివరీ బాయ్​గా మారిన‌ ఆడీ ఆర్​8 కార్​ ఓనర్​.. ప్రాంక్ కాదండోయ్