AP Edcet 2023 Exam Date: ఏపీ ఎడ్‌సెట్-2023 హాల్ టికెట్లు విడుదల.. మరో వారం రోజుల్లో పరీక్ష

|

Jun 07, 2023 | 2:40 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్‌ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఈడీ, స్పెషల్‌ బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించనున్న..

AP Edcet 2023 Exam Date: ఏపీ ఎడ్‌సెట్-2023 హాల్ టికెట్లు విడుదల.. మరో వారం రోజుల్లో పరీక్ష
AP Edcet 2023 Exam
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్‌ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఈడీ, స్పెషల్‌ బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించనున్న ఏపీ ఎడ్‌సెట్‌-2023 పరీక్ష జూన్ 14న జరుగుతుందని ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె రాజేంద్రప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎడ్‌సెట్ నిర్వహిస్తోంది.

ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ నమదో చేసి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ జూన్‌ 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ఎడ్‌సెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.