AP EAPCET 2023 Result Date: జూన్‌ 12న ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల..! ముఖ్యమైన వివరాలివే..

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌-2023 పరీక్ష ఫలితాలు జేఎన్‌టీయూ అనంతపూర్‌ వచ్చే వారం విడుదలచేసే అవకాశం ఉంది. జూన్‌ 12న రిజల్ట్స్‌ విడుదల చేయనున్నట్లు ఈఏపీసెట్‌ చైర్మన్‌ కే హేమచంద్ర రెడ్డి..

AP EAPCET 2023 Result Date: జూన్‌ 12న ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల..! ముఖ్యమైన వివరాలివే..
AP EAPCET 2023 Result Date

Updated on: Jun 07, 2023 | 3:05 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌-2023 పరీక్ష ఫలితాలు జేఎన్‌టీయూ అనంతపూర్‌ వచ్చే వారం విడుదలచేసే అవకాశం ఉంది. జూన్‌ 12న రిజల్ట్స్‌ విడుదల చేయనున్నట్లు ఈఏపీసెట్‌ చైర్మన్‌ కే హేమచంద్ర రెడ్డి సోమవారం ఓ ప్రటకనలో తెలిపారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

కాగా ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు మే 15 నుంచి 19 వరకు జరిగాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహించారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్షలకు దాదాపు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’లు కూడా ఇప్పటికే విడుదల చేశారు. ప్రాథమిక ఆన్సర్‌ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఆన్సర్‌ కీ తయారు చేస్తారు. ఫలితాలతోపాటు, తుది ఆన్సర్‌ కీ కూడా విడుదల చేస్తారు. ఫలితాల అనంతరం ఒకటి, రెండు రోజుల్లో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా విడుదల చేస్తారు. ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌లో సీటు కేటాయింపులు ఉంటాయి. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.